నేడు అటవీ అమరవీరుల సంస్మరణ

సాధించిన విజయాలపై ఫోటో ప్రదర్శన
చిత్తూరు,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు తమిళ కూలీలు శేషాలం అడవుల్లోకి రాకుండా టాస్క్‌ఫోర్స్‌ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.  కూలీలు అడవుల్లోకి వచ్చి ప్రాణాలు కోల్పోవద్దని, అలాగే జాతీయ సంపదను కొల్లగొట్టవద్దని ఇచ్చే సందేశంతో లఘు చిత్రాన్ని గతేడాది రూపొందించారు. ఇది మంచి ఫలితం ఇచ్చింది.  ఈనెల 21న జరుగనున్న అటవీవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైన నాటి నుంచి సాధించిన విజయాలు, నమోదుచేసిన కేసులు, అర్టెస్టుల వివరాలతో ఫొటోప్రదర్శన ఏర్పాటుచేసి, ప్రజలకు వివరించే ఏర్పాట్లు చేస్తున్నారు.  ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌ బాగా పనిచేస్తోందని డీఐజీ డాక్టర్‌ ఎం. కాంతారావు అన్నారు. తమిళనాడులో స్మగ్లర్లు ఉంటున్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, లఘుచిత్రాలను రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రజలు కూడా ఎర్రచందనాన్ని కాపాడుకోవడం తమవంతు బాధ్యతగా భావించాలని, స్మగ్లర్లను ఎదుర్కోవడంలో అటవీశాఖకు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు సహకరించాలని, స్మగ్లర్లను ఎదుర్కొనే సమయంలో మద్దతు ఇవ్వాలని కోరారు. రెండేళ్ల కిందట టాస్క్‌ఫోర్స్‌ ఆవిర్భవించిన తరవాతే ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించడం, స్మగ్లర్లను సమర్థంగా అడ్డుకొన్నట్లు చెప్పారు. స్మగ్లర్లను పట్టుకుని కేసుల నమోదు చేయడం కోసం పోలీసు, అటవీశాఖలను బతిమాలుకోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గడచిన 50 ఏళ్లలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల  పరిధిలోని అడవుల్లోని శ్రీగంధంవృక్షాల అక్రమరవాణా జరుగుతూ వచ్చింది.