నేడు రాజ్‌భవన్‌కు ఇద్దరు చంద్రులు

1

– విందుకు ఆహ్వానించిన గవర్నర్‌

హైదరాబాద్‌,జూన్‌29(జనంసాక్షి):

హైదారబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి మంగళవారం విందు ఇస్తున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఈ విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చిన సందర్భంగా రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి, ఇరు రాష్ట్రాల సీఎంలకు గవర్నర్‌ నరసింహన్‌ రేపు విందు ఏర్పాటు చేశారు. దీనికి సతీసమేతంగా రావాలని గవర్నర్‌ ఇరు రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానాలు పంపారు. దీంతో ఉప్పూ, నిప్పుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ రాజ్‌భవన్‌ వేదికగా మంగళవారం ఎదురుపడబోతున్నారు. ఈ విందుకు హాజరు కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దాంతో రేపటి విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరవుతారా? వస్తే చంద్రబాబును పలకరస్తారా? మాటలు కలుస్తాయా? అనే ఉత్కంఠ నెలకొంది. నెల రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  గవర్నర్‌ ఇచ్చే విందుకు ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు, ముఖ్య అధికారులకు ఆహ్వానాలు అందాయి. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో విందు జరగనుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గౌరవార్థం ఈ విందు గవర్నర్‌ ఏర్పాటు చేశారు.  కేంద్ర, రాష్ట్ర మంత్రులనూ గవర్నర్‌ ఈ విందుకు ఆహ్వానించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పది రోజుల పర్యటన నిమిత్తం సోమవారం హైదరాబాద్‌ నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే.