నేడే లష్కర్‌ బోనాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు

బంగారు బోనమెత్తనున్న ఎంపి కవిత

హైదరాబాద్‌,జూలై28(జ‌నం సాక్షి): ఆషాఢజాతర సందడితో లష్కర్‌ బోనాలకు రంగం సిద్దం అయ్యింది. ఎక్కడ చూసినా బోనాల సందడి నెలకొంది. వీధుల్లో అంగరంగ వైభవంగా విద్యుద్దీపాలు అలంకరించారు.ఉజ్జయిని మహంకాళి బోనాలు జాతర సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ప్రత్యేకశ్రద్దతో ఏర్పాట్లు అదిరిపోయాయి. ఎంపి కవిత బంగారు బోనంతో అమ్మవారికి మొక్కుతీర్చనున్నారు. సిఎం కెసిఆర్‌ సహా మంత్రులు అమ్మవారి దర్శననానికి రానుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా. ప్రశాంత వాతావరణంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ సుమతి తెలిపారు. ఈ నెల 29, 30వ తేదీల్లో జరిగే మ¬త్సవాలకు 25నుంచి 30లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనా నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. 200 సీసీ కెమెరాల నిఘాతో పాటు 3వేల మంది పోలీసులను మొహరించినట్లు వివరించారు. మహంకాళి ఠాణాలో తాత్కాలికంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడే అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వీఐపీలు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అలాగే డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, ఇతర ఉన్నతాధికారులుతో పాటు ఉత్తరమండలం డీసీపీ సుమతి, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావుల నేతృత్వంలో భద్రత ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. అలాగే మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏర్పాట్లను సవిూక్షిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి పోలీసులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి స్వాధీనం తీసుకోనున్నారు. సుభాష్‌రోడ్డుతో పాటు ఆలయం వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేశారు. సుభాష్‌రోడ్డు నుంచి బోనాలతో వచ్చే మహిళలను మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అమ్మవారి జాతరకు వచ్చే భక్తుల కోసం ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక పార్కింగ్‌ లను ఏర్పాటు చేశారు. ప్యాట్నీ సెంటర్‌ నుంచి వచ్చే వారికి మహబూబ్‌ కళాశాల మైదానంలో వాహనాలను పార్కింగ్‌ చేయాలి. సీటీవో ప్యారడైజ్‌ మార్గం నుంచి వచ్చే భక్తులకు పార్క్‌లైన్‌, గాంధీ విగ్రహం వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌ నుంచి వచ్చే భక్తులకు రాణిగంజ్‌ కూడలిలోని ఆడవయ్య కూడలి మైదానంలో.. సీఎంఆర్‌ కూడలి, మంజు, థియేటర్‌ నుంచి వచ్చే భక్తులకు తాజ్‌త్రీస్టార్‌ ¬టల్‌ ముందు..సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వచ్చే వాహనాలకు ఓల్డ్‌ జైల్‌ఖానా వద్ద పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.