నేపాల్‌ నేలమట్టం

C

5

 

 

 

6
-కుప్పకూలిన చారిత్రాత్మక కట్టడాలు

-మరుభూమిగా ఖాట్మండు

-భూకంప తీవ్రతతో 1500 మంది మృతి

– వేలాదిగా క్షతగాత్రులు

– కొనసాగుతున్న సహాయ చర్యలు

– రెండున్నర గంటల్లో 12 సార్లు ప్రకంపనలు

-నేపాల్‌లో అత్యవసర పరిస్థితి

ఖాట్మండ్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి):  నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. రాజధాని నగరం కాఠ్‌మాండూకు 77 కిలోమీటర్ల దూరంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.9గా నమోదైన ఈ భూకంప తీవ్రతకు ఎత్తైన భవనాలు, చారిత్రక కట్టడాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల నుంచి భారీ సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య 1500కు చేరినట్లు సమాచారం. కాఠ్‌మాండూ వీధులన్నీ ఆర్తనాదాలు, హాహాకారాలతో దద్దరిల్లుతున్నాయి. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో పూర్తిగా నిండిపోయాయి. అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్తు, సమాచార, రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శనివారం ఉదయం 11.41 నిమిషాలకు సుమారుగా నిమిషం 8 సెకన్లపాటు భూమి కంపించినట్లు గుర్తించారు. భూప్రకంపనల కారణంగా ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్‌లో సంభవించిన భూకంప ప్రభావం భారత్‌, బంగ్లాదేశ్‌, మలేసియాల్లోనూ కన్పించింది.

కాఠ్‌మాండూలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం..

భూకంపం ధాటికి నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండవచ్చని తెలుస్తోంది. భవనాలు, గోడలు పెద్దఎత్తున కూలిపోవటం వల్ల శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారు. కాఠ్‌మాండూలోని పాత నగరంలో భూకంప ప్రభావం అధికంగా ఉంది.భూకంపం తీవ్రతకు పురాతన, చారిత్రక కట్టడాలతో పాటు నేపాల్‌ రాజకోటను ఆనుకొని ఉన్న గోడలు సైతం కూలిపోయాయి. దాదాపు 500మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

కాఠ్‌మాండూలో తెలుగు యాత్రికులు సురక్షితం

నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో సంభవించిన భారీ భూకంపం నుంచి 25మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. భూకంప తీవ్రతకు నేపాల్‌ కకావికలమైంది. భూకంపం సంభవించినప్పుడు తామంతా ¬టల్‌లో ఉన్నామని యాత్రికుడు ్ణొరి తెలిపారు. తామంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాలుగో అంతస్తు నుంచి బయటకు పరుగులు తీశామని వివరించారు. ప్రస్తుతం వీరంతా పశుపతినాథ్‌ దేవాలయం వద్ద సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

పలు పట్టణాల్లో ధ్వంసమైన భవనాలు, రహదారులు

నేపాల్‌లో శనివారం ఉదయం సంభవించిన భారీ భూకంప తీవ్రతకు దేశంలోని పలు పట్టణాల్లో భవనాలు, రహదారులు ధ్వంసమమయ్యాయి. నేపాల్‌లో చరవాణి సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

చారిత్రక కట్టడాలు నేలమట్టం..

నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు, కోటలు కుప్పకూలాయి. ఈ భూకంపం పాత కాఠ్‌మాండూలోని హన్‌మాన్‌ డోక ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపింది. కాఠ్‌మాండూలో పెద్దసంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

ధరాహరా టవర్‌ కింద చిక్కుకున్న 400 మంది

కాఠ్‌మాండూలో 1832లో నిర్మించిన 62 మీటర్ల ఎత్తైన చారిత్రక ధరారా టవర్‌ కుప్పకూలింది. ఈ టవర్‌ శిథిలాల కింది నుంచి 180 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరికొందరు శిథిలా కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

నేపాల్‌కు భారత్‌ సహాయక బృందాలు

భూకంపం తీవ్రతతో కకావికలమైన నేపాల్‌కు సాయమందించేందుకు భారత్‌ ముందుకొచ్చింది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ అధినేతలతో మాట్లాడారు. కావాల్సిన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. భారత్‌ నుంచి నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని ఆ దేశానికి పంపింది. భూకంపం ధాటికి నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. పురాతన కట్టడాలు, చారిత్రక భవనాలు నేలకొరిగాయి. శిథిలాల నుంచి బాధితులను రక్షించేందుకు నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.శనివారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం నేపాల్‌ను అతలాకుతలం చేసింది. భూకంపం వల్ల 1500 మంది చనిపోయారని ఆ దేశ ¬ం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌ లో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండవచ్చని తెలుస్తోంది. భవనాలు, గోడలు పెద్దఎత్తున కూలిపోవటం వల్ల శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. ఖాట్మండ్‌ లోని పాత నగరంలో భూకంప ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడి పాత భవనాల గోడలు అధిక సంఖ్యలో కూలిపడ్డాయి. రాజధానిలో భీతావాహ పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు వినపిస్తున్నాయి. ప్రజల రోదనలు మిన్నంటాయి. సహాయక చర్యలకు సైన్యం, ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్ది శాలు బయటపడుతూ మృత్యుదిబ్బను తలపిస్తున్నాయి. ఇక్కడ సెల్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఖాట్మండ్‌ విమానాశ్రయాన్ని మూసివేశారు. చారిత్రక దరహరా స్థూపం కుప్పకూలింది. భూకంపం ధాటికి నేపాల్‌ అతలాకుతలమైంది. పురాతన, చారిత్రక కట్టడాలతో పాటు నేపాల్‌రాజకోటను ఆనుకొని ఉన్న గోడలు సైతం కూలిపోయాయి. దాదాపు 500మంది శిథిలాల్లో చిక్కుకున్నారు.  నేపాల్‌ భూకంప ప్రభావం భారత్‌, బంగ్లాదేశ్‌, మలేసియా దేశాల్లోనూ ఉంది.నేపాల్‌లోని ఖాట్మండ్‌ సవిూపంలో సంభవించిన భూకంప తీవ్రతను అమెరికా జియోలాజికల్‌ సర్వే(యూఎస్‌జీఎస్‌) మొదట రిక్టర్‌ స్కేలుపై 7.5గా నమోదైనట్లు ప్రటించింది. తర్వాత భూకంప తీవ్రతను సవరించి ఉదయం 11.56 గంటలకు లామ్‌జంగ్‌ ప్రాంతంలో 7.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్‌ ప్రకటించింది.భూకంప ప్రభావం హిమాయాల పర్వతాల్లోనూ ఉంది. ఎవరెస్టు శిఖర ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు సంభవించడంతో పలువురు పర్వతారోహకులు గల్లంతైట్లు సమాచారం. భారత ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌ లో భారీ భూకంపం సంభవించడంతో అక్కడి విమానాశ్రయం దెబ్బతింది. దీంతో భారత్‌ నుంచి ఖాట్మండ్‌ కు విమానసేవలు రద్దుచేశారు. ఇప్పటివరకూ అందిన వివరాల ప్రకారం 1500మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూప్రకంపనలతో నేపాల్లోని పురాతన భవనాలు, ఆలయాలు, చారిత్రక కట్టడాలతో పాటు గృహ సముదాయాలు, కార్యాలయాలు కుప్పకూలాయి.  నేపాల్‌ కేంద్రంగా ఖట్మాండుకు 83 కిలోవిూటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.  రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 8.1గా నమోదైంది.  నేపాల్‌ లాంజంగ్‌ ప్రాంతంలో భూప్రకంపనలు అధికంగా నమోదు అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. మరోవైపు గాయపడినవారు పెద్ద ఎత్తున ఖాట్మాండ్లోని ఆస్పత్రులకు తరలి వస్తున్నారు. ఇంకా చాలా మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. పాత ఖాట్మాండ్‌లోని హన్మాన్‌ డోక ప్రాంతంలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, నేపాల్‌ లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. దుమ్ముధూళితో ఖాట్మాండ్‌ నిండిపోయింది. అలాగే నేపాల్లో కమ్యూనికేషన్‌ వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. టెలికమ్‌ సేవలు నిలిచిపోయాయి.  నేపాల్‌ సరిహద్దు రాష్టాల్లో భూకంప ప్రభావం తీవ్రమని అధికారులు అంచనా

వేస్తున్నారు. నేపాల్‌ లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. భూకంపం వచ్చిన సమయంలో సుమారు 25 మంది తెలుగు భక్తులు ఖాట్మండ్‌లో ఉన్నారు. ఆ సమయంలో వీరు ఓ హాటల్‌లో బస చేస్తున్నారు. భూకంప తీవ్రతను చూసి భక్తులు బయటకు పరుగులు తీశారు. భక్తులకు సురక్షితంగా బయటపడ్డారు. ఈ భక్తులంతా హైదరాబాద్‌కు చెందిన వారు.

నేపాల్‌కు నాలుగు సహాయక బృందాలు పంపిన భారత్‌

భూకంపం తీవ్రతతో కకావికలమైన నేపాల్‌కు సాయమందించేందుకు భారత్‌ ముందుకొచ్చింది. భారత్‌ నుంచి నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని నేపాల్‌ పంపారు. భూకంపం ధాటికి నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. పురాతన కట్టడాలు, చారిత్రక భవనాలు నేలకొరిగాయి. శిథిలాల నుంచి బాధితులను రక్షించేందుకు నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దీంతో స్పందించిన ప్రధాని మోడీ సహాయక బృందాలను పంపుతున్నట్లు తెలిపారు.

రెండున్న గంటలలో 12 సార్లు ప్రకంపనలు

నేపాల్‌లోని ఖాట్మండ్‌ 77 కి.విూల దూరంలో ఉదయం 11.41గంటలకు 7.5 తీవ్రతతో తీవ్రతతో భూకంపం సంభంవించిన తర్వాత రెండున్నర గంటల వ్యవధిలో దాదాపు 12చోట్ల భూక్రపంనలు సంభవించాయి. నేపాల్‌లో పలు చోట్ల సంభవించిన భూప్రకంపనల తీవ్రత వివరాలిలా ఉన్నాయి.  కొడారికి 28కి.విూల దూరంలో 5.1 తీవ్రత, లామ్‌జంగ్‌కు 49కి.విూల దూరంలో 6.6తీవ్రత  నగర్‌కోట్‌కు 25కి.విూల దూరంలో 5.5తీవ్రత, కొడారికి దక్షిణంలో 25కి.విూల దూరంలో 5.0తీవ్రత  ప్పొటికి 5కి.విూల దూరలో 4.8తీవ్రత , బనేపాకు 22కి.విూల దూరంలో 4.5తీవ్రత, నగర్‌కోట్‌కు 15కి.విూల దూరంలో 5.0తీవ్రత , నగర్‌కోట్‌కు 20కి.విూల దూరంలో 4.6తీవ్రత , బనేపాకు 17కి.విూల దూరంలో 4.9తీవ్రత, కొడారికి పశ్చిమంలో 22కి.విూల దూరంలో 4.7తీవ్రత , లామ్‌జంగ్‌కు 41కి.విూల దూరంలో 5.0తీవ్రత, బనేపాకు ఒక కి.విూ దూరంలో 5.3తీవ్రతగా నమోదయ్యింది.