నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం

నోయిడా: నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న వాహనాల పొరపాటుతో వెనకాల వస్తున్నమరో కారు ప్రమాదానికి గురైంది. మారుతీ ఏకో వాహనం అమాంతం గాలిలోకి లేచి పక్కనే ఉన్న అడవిలోకి పల్టీలు కొడుతూ పడిపోయింది. అందులోని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయినా అతనిని కాపాడలేకపోయారు. భారీ క్రేన్ సాయంతో బోల్తాపడిన వాహనాన్ని బయటకు తీశారు. స్విఫ్ట్ డిజైర్ కారు వేరే కారును అతి సమీపం నుంచి ఓవర్ టేక్ చూసింది. దీంతో వేరే కారు డ్రైవర్ పూర్తిగా ఎడమవైపు నుంచి పోనిచ్చాడు. వెనకాలే వస్తున్న మారుతీ ఏకో వాహనం ఆ కారును ఢీ కొట్టి పల్టీకొట్టింది.