పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం కండి: ఎమ్మెల్యే

వరంగల్‌,జనవరి25(జ‌నంసాక్షి): త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ పిలుపిచ్చారు. కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమై గ్రామాల్లో వార్డుమెంబర్లకు అవసరమైన కార్యకర్తల ఎంపిక, ఓటర్‌లిస్ట్‌ సమాచారాన్ని సేకరించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు నూతన పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన జరుగుతుందని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తుందన్నారు. కేసీఆర్‌ ప్రజల్లో మమేకమై పరిపాలన కొనసాగిస్తూ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి పథకాలను అమలు పరుస్తున్నారన్నారు. కొద్దిరోజుల్లో దేశంలోని అన్నిరాష్టాల్ర కంటే తెలంగాణ రాష్టాన్న్రి ముందంజలో ఉంచడంలో సీఎం కేసీఆర్‌ సఫలీకృతులయ్యారన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పల్లెనిద్ర, గడపగడపకు టీఆర్‌ఎస్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలతో పాటు, ఇవ్వని హావిూలను కూడా అమలు చేస్తూ సీఎం కేసీఆర్‌ ప్రజారంజక పాలనను అందిస్తున్నారన్నారు.

సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకే రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనకు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలకు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎంతగానో ఆకర్షితులవుతున్నారన్నారు.

అభివృద్ధి కోసం విధివిధానాలు, ఆలోచనలో కేసీఆర్‌కు ఎవరూ సాటిలేరని ఉద్భోదించారు. జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో భక్తరామదాసు, సీతారామప్రాజెక్టును మంత్రి హరిష్‌రావు సహకారంతో నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషిచేశారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తయితే బీడుభూములన్నీ సస్యశ్యామలం చేయుటకు గోదావరి జలాలు ఉపయోగపడతాయని తెలిపారు. సాగర్‌ ఆయకట్టు చివరిభూములకు నీరు పూర్తిస్థాయిలో చేరుతుందని వివరించారు.