పంటమార్పిడి వ్యవసాయమే మేలు

సేంద్రియ ఎరువులతోనే లాభాలు

ఆదిలాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే భావితరానికి మంచి పంటలు పండే భూములను అప్పగించినట్లవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు అన్నారు. పంట మార్పిడి విధానంలో సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, గుడిహత్నూర్‌, ఇచ్చోడ తదితర మండలాల్లోని సాగు భూములు ఆవాలు, ధనియాల పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. పంటల సాగులో రసాయనాల వాడకం తగ్గించాలన్నారు. జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు శిక్షణ శిబిరాలునిర్వహించిఅవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా రైతులు సోయా పంటను సాగు చేస్తున్నప్పుడు నిజామాబాద్‌ జిల్లా రైతులను ఇక్కడికి తీసుకొచ్చి పంటపై అవగాహన కల్పించామన్నారు. అనంతరం అక్కడి రైతులు నిజామాబాద్‌ జిల్లా సోయా పంటలు సాగు చేస్తున్నట్లు గుర్తు చేశారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి పట్టణాల నుంచి పల్లెలకు పంపించే

విధంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీఠ వేస్తుందని వెల్లడించారు.అత్యధిక బడ్జెట్‌ను రైతాంగ సంక్షేమానికి కేటాయించారని తెలియచేశారు. హరితహారం కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాలకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తిచేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కకు జియోట్యాగింగ్‌ ద్వారా అనుసంధానం చేయాలని, ప్రతి గ్రామాన్ని హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు హరిత బిగ్రేడ్‌లను నియమించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.