పంటలబీమా తప్పనిసరి: కలెక్టర్‌

కామారెడ్డి,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనను ప్రతి రైతు వినియోగించుకుని డిసెంబరు 15వతేదీ లోగా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. నామ్‌లోని రైతులకు విూ సేవలో ప్రీమియం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మేజర్‌ పంటలకు గ్రామం ఒక యూనిట్‌గా, మైనర్‌ పంటలకు మండలం ఒక యూనిట్‌గా ప్రీమియం సంబంధిత విలేజ్‌ అకౌం ట్‌ నెంబర్‌ ద్వారా డెబిట్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పంటలు దెబ్బతింటే వెంట నే క్షేత్రస్థాయిలో విచారణ చేసి నష్టపరిహారం అందించాలన్నారు. వరి ప్రీమియం గతంలో రూ.420 ఉండగా ఇప్పుడు రూ.412 ఉందన్నారు. జొన్న రూ.160, మొక్కజొన్న రూ.375 ప్రీ మియంగా చెల్లించాలన్నారు. ఖరీఫ్‌ కాలానికి గాను పంట నష్టానికి జిల్లాకు రూ.18 కోట్ల 73 లక్షలు విడుదలైందని, వాటిని రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కింద రూ.7 కోట్ల 15 లక్షలు విడుదల అయ్యాయని తెలిపారు. మామిడి పంట ప్రీమియం రూ.1250 చెల్లించాలన్నారు. రైతులు బ్యాంకు రుణాలను వెంటనే చెల్లిస్తే ప్రీమియం రెన్యువల్‌ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు లక్షా 57 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.250 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా రూ.150 కోట్లు చేశారని అన్నారు. రైతుల భూముల వివరాలను ఎల్‌ఆర్‌యూపీ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశామన్నారు.