పంటల గిట్టుబాటుకు..  నూతన పథకం


– ఎన్నికల అనంతరం అమల్లోకి తెస్తాం
– నాలుగేళ్ల పసిగుడ్డు తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది
– ఉద్యోగస్తులకు అత్యధిక వేతనాలు అందిస్తున్నాం
– రెప్పపాటు కరెంట్‌ పోకుండా చేసుకున్నాం
– పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ కథ మొదటికే వస్తది
– జాగ్రత్తగా ఉండి ఓటు వేయండి
– హుజూరాబాద్‌ ప్రజా ఆశీర్వాదా సభలో సీఎం కేసీఆర్‌
కరీంనగర్‌, నవంబర్‌20(జ‌నంసాక్షి) : గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి
వచ్చిన నాలుగేళ్ల కాలంలో రైతులకు అండగా నిలిచామని, అంతటితో ఆగకుండా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా నూతన పథకాన్ని రూపొందించినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎన్నికల అనంతరం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. అద్భుతమైన చైతన్యం చూపించిన ప్రాంతం హుజూరాబాద్‌ అన్నారు. తెలంగాణ వచ్చేనాటికి ఎన్నో బాధలు, అవమానాలు.. కష్టపడి పోరాటం చేశామని, రాష్ట్రం కల సాకారం అయిందన్నారు. అనేక శాపాలు, దీవెనలు పెట్టిన పెద్దలు ఉన్నారన్నారు. నాలుగు సంవత్సరాల పసిగుడ్డు తెలంగాణ అని, ఇప్పుడు అనేక విషయాల్లో నెంబర్‌ వన్‌ నిలిచిందన్నారు. ఆర్థిక పెరుగుదలలో, ¬ంగార్డులు, ఆశావర్కర్లు వంటి చిన్న ఉద్యోగస్తులు అత్యధిక వేతనం పొందుతున్న రాష్ట్రం ఏదయ్యా అంటే తెలంగాణెళి అని చెబుతున్నారన్నారు. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. బిల్లుల మోతలు లేవని, కోతలు లేవన్నారు. కరెంటు ఇక పోదని, పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ కథ మొదటికే వస్తదని, తస్మాత్‌ జాగ్రత్త అని కేసీఆర్‌ సూచించారు. వచ్చే పంటకు కొన్ని నీళ్లు కావాలని అడుగుతున్నరని,  ఎస్సారెస్పీలో నీళ్లు ఉన్నాయని, పంట కోత దశ వరకు నాలుగు, ఐదు తడులకు బాజాప్తగా నీళ్లు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 70శాతం వ్యవసాయరంగం విూదనే ఆధారపడి బతుకుతున్నామని, రాబోయే జూన్‌ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమవుతుందన్నారు. కరీంనగర్‌ జిల్లా వాటర్‌ జంక్షన్‌ కాబోతుందని, నీటి కొరత భవిష్యత్తులో ఉండదన్నారు. కట్టిన చెక్‌ డ్యామ్‌ జలకళతో ఉంటాయన్నారు. రైతాంగానికి నీళ్తు తెస్తున్నామని, పెట్టుబడి సాయం కోసం రైతుబంధు, అకాల మరణం చెందితే కుటుంబానికి చేయూతగా రైతు బీమా ఇవన్ని బాగానే చేసుకుంటున్నామని, అయితే అసలు సమస్య పంటకు గిట్టుబాటు ధరేనన్నారు. దానికోసం అద్బుతమైన స్కీం రూపొందించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం అన్ని ఆహార వస్తువులు కల్తీ అవుతున్నాయని, ప్రజలకు కల్తీ పోవాలన్నా, రైతులకు గిట్టుబాటు ధర దక్కాలన్నా.. రేషన్‌ డీలర్ల బాధలు పోయేలా.. ఐకేపీ ఉద్యోగులు పర్మినెంట్‌ చేస్తూ నూనత పథకాన్ని రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని బ్రహ్మండంగా పెంచుకుంటూ పోతున్నమన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితో పాటు, సంక్షేమ పింఛన్లను డబుల్‌ చేస్తున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు.
లక్ష మెజార్టీతో ఈటెలను గెలిపించాలి…
హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఈటల రాజేందర్‌ అద్భుతంగా అభివృద్ధి చేశాడని సీఎం చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి మిడ్‌ మానేరు, ఎల్‌ రిజర్వాయర్లు నిండే ఉంటాయన్నారు. ఈటల రాజేందర్‌ గెలుస్తాడని.. 80శాతం ఓట్లు ఈటలకే ఉన్నాయని సర్వే చెబుతుందన్నారు. ఈటల గెలుపు విషయంలో తనకెలాంటి సందేహం లేదని కేసీఆర్‌ అన్నారు. రాజేందర్‌ ను రికార్డు బ్రేక్‌ తో గెలిపించాలని కోరారు. రాజేందర్‌.. కేసీఆర్‌ కుడి భుజమన్నారు. లక్ష ఓట్ల కన్నా తక్కువ రావద్దని సీఎం పేర్కొన్నారు.
ఈ సభలో రాష్ట్ర ఆర్థికమంత్రి, హుజూరాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, అక్బర్‌, లక్ష్మారెడ్డి, సాయిరెడ్డి, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.