పకడ్బందీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు 

గ్రామాల్లో నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలి: జడ్పీ అధికారి
ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌13 (జనంసాక్షి):  గ్రామాల్లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎస్‌.కిషన్‌ అన్నారు. అధికారులు తమకు సూచించిన మేరకు కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గ్రామాల్లో అభివృద్ది లక్ష్యంగా చేపట్టిన పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు రోజూ గ్రామాలను సందర్శించాలన్నారు. 30 రోజుల ప్రణాళికలో రోజువారీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వివరాలను నిత్యం సాయంత్రం సంబంధిత మండలాల ప్రత్యేకాధికారులకు నివేదించాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు జిల్లా అధికారులకు నివేదించాలన్నారు. గ్రామస్థాయి ప్రత్యేకాధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు  ఆయా మండలాల్లో ప్రణాళిక అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాల పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.గ్రామాలలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక చేసిన పనులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో రోజువారీ కార్యక్రమాల తీరుపై ఆరా తీశారు. ముఖ్యంగా చెత్తను డంపింగ్‌ యార్డుల్లో వేసేలా చూడాలని అధికారులకు చెప్పారు. శ్మశాన వాటికల నిర్మాణాల్లో ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించాలన్నారు. గ్రామంలో అన్ని
కుటుంబాలు మరుగుదొడ్ల నిర్మించుకొని వాటిని వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు.
హరితహారంలో భాగంగా మొక్కలను ప్రభుత్వ ఖాళీ ప్రదేశాల్లో నాటేలా చూడాలన్నారు. గ్రామంలో ఒక ఆదర్శ గృహాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తులకు దానిని మోడల్‌గా చూపించాలన్నారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోజువారి కార్యక్రమాలను తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఆఖరు వరకు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు చెప్పారు. ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి వారికి అవగాహన కల్పించాలన్నారు.