పక్కాగా ఉపాధి ఉండాలి

ఏలూరు,మే17(జ‌నం సాక్షి): ఉపాధి హావిూ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  లేబర్‌ కాంపోనెంట్‌ 60 శాతం, మెటీరియల్‌ కాంపోనెంట్‌ 40 శాతం ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ కిందిస్థాయిలో పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. గ్రావిూణప్రాంతాల్లో డ్రెయిన్‌లు, వ్యక్తిగత మరుగుదొడ్లు ఎన్‌టిఆర్‌ గృహ నిర్మాణాలకు ఈ నిధులను మళ్లించి కాంట్రాక్టర్లకు మేలు చేసి కూలీలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేసిని పనికి ఎంత వేతనం పడిందో తెలియాలంటే ప్లేస్లిప్‌లు ఇవ్వాలని కోరారు. చట్టంలో పేర్కొన్న వసతులు, సౌకర్యాల కల్పనకు అధికారులు చొరవచూపాలని కోరారు. ఉపాధి పనుల్లో యంత్రాల వినియోగం నివారించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామన్నారు.