పక్కాగా ఉపాధి పనులు

సిద్దిపేట,మే23(జ‌నం సాక్షి):ఉపాధిపనులను పారదర్శకంగా నిర్వహించాలని గ్రావిూణాభివృద్ధిశాఖ అధికారులు  ఈజీఎస్‌ సిబ్బందికి సూచించారు.  ఉపాధికూలీలు ఈ సందర్బంగా ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకవచ్చారు.  శ్రమకు తగిన వేతనం వచ్చేలా చొరవ తీసుకోవాలని అన్నారు. బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడని కారణంగా కూలీల వేతనాలు ఇవ్వడం లేదని సమస్యను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. కొలతల ఆధారంగానే వారికి కూలీ వస్తుందని తెలిపారు. ఈ సందర్బంగా కూలీలకు ఇచ్చిన కొలతలను పరిశీలించి వారు ఎంత పనిచేశారు, ఎంత వేతనం వస్తుందో లెక్కించారు. ఉపాధికూలీలు వేకువజామునే పనికి వచ్చినట్లయితే ప్రభుత్వం ఇచ్చిన కనీస వేతనం వస్తుందని ఆయన తెలిపారు. పనిప్రదేశాల వద్ద టెంట్లు, ప్రథమచికిత్స పెట్టెలు, మంచినీరు సదుపాయం కల్పించాలని, గ్రూపులకు గడ్డపారలు అందజేయాలని జడ్పీటీసీ లక్కినేని ఈజీఎస్‌ సిబ్బందికి సూచించారు.