పగటి కలలపై నిషేధం లేదు: జవదేకర్‌

న్యూఢిల్లీ,మే22(జ‌నం సాక్షి ): ప్రధాని పదవి చేపట్టడానికి తాను సిద్ధమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భాజపా విమర్శలు గుప్పిస్తోంది. పగటి కలలు కనడంపై దేశంలో ఎలాంటి నిషేధం లేదని ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఎద్దేవా చేశారు. దేశంలో 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కానీ రాహుల్‌ గాంధీ మాత్రం దేశానికి ప్రధాని కావాలని ఆలోచిస్తున్నారు. అయితే ఈ దేశంలో పగటి కలలు కనడంపై ఎలాంటి నిషేధం లేదు’ అని జావడేకర్‌ విూడియాతో అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ప్రధాని పదవి చేపట్టడానికి తాను సిద్ధమని ఇటీవల రాహుల్‌గాంధీ పేర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే పార్లమెంట్‌ ఎనికల్లో మోదీకి రాహుల్‌గాంధీ పోటీ ఇస్తారా? అని జావడేకర్‌ను అడగ్గా.. ‘ఓ స్మార్ట్‌ ట్వీట్‌ లేదా పెద్ద చర్చ రాజకీయం కాదు. రాజకీయం అంటే అంతకంటే ఎక్కువ’.. అని సమాధానమిచ్చారు.
—-