పటేల్‌ వల్లే సంస్థానాల విలీనం

– కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌

– భాజపాలో చేరిన డీఎస్‌ తనయుడు అరవింద్‌

నిజామాబాద్‌,సెప్టెంబర్‌ 17,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో సంకల్ప సభ జరిగింది. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో డీఎస్‌ తనయుడు అరవింద్‌ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడారు. ‘తెలంగాణ ప్రజలకు నా వందనాలు. తెలంగాణకు సంబంధించి సెప్టెంబర్‌ 17 చారిత్రాత్మకమైన రోజు. ప్రపంచంలోనే భారత్‌ బలమైన దేశంగా మారింది. ఆనాడు ఆంగ్లేయులను తరిమి కొట్టి ఐకమత్యం అంటే ఏమిటో మనం ప్రపంచానికి చాటి చెప్పాం. సర్దార్‌ పటేల్‌ కృషి వల్లే భారత్‌లో తెలంగాణ ఒక భాగమైంది.ఈ సభకు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హన్స్‌రాజ్‌ అహిర్‌ పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రామచంద్రరావు, ఎన్వీఎస్‌ ప్రభాకర్‌, నాగం జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. భారత్‌ ప్రపంచంలోనే బలమైన దేశంగా మారిందన్నారు. నాడు అందరూ ఏకమై ఆంగ్లేయులను తరిమికొట్టి ఐకమత్యం అంటే ఏమిటో ప్రపంచానికి చాటామని చెప్పారు. సర్దార్‌ పటేల్‌ కృషి వల్లే అఖండ భారత్‌లో తెలంగాణ ఒక భాగమైందని గుర్తుచేశారు.కాంగ్రెస్‌ పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అవినీతికి పాల్పడిన నాటి మంత్రులు నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. భాజపాలో ఏ మంత్రీ అవినీతికి పాల్పడలేదన్నారు. త్వరలో బినావిూ నిరోధక చట్టం తీసుకొచ్చి బినావిూల ఆట కట్టిస్తామన్నారు.