పత్రిక ప్రకటనపత్రిక ప్రకటనకొమురం భీమ్ ఆసిఫాబాద్

పత్రిక ప్రకటనపత్రిక ప్రకటనకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతేది: 02 డిసెంబర్ 2022  ” జిల్లా లో అత్యంత మారుమూల  ప్రాంతమైన గుండాల గ్రామ (తిర్యాని మండలం)   రోడ్డు నిర్మాణంలో భాగస్వాములవ్వడం ఆనందదాయకం –  జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్.
గుండాల గ్రామానికి నవ స్వాతంత్రం  సిద్ధించింది – జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపీఎస్

గిరిజనుల జీవితాల్లో  వెలుగులు నింపడమే  పోలీసుల అంతిమ లక్ష్యం
గిరి పుత్రుల కల నెరవేరిన వేళ
పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా  తిర్యాని మండలంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో  రోంపల్లి నుండి గుండాల వరకు 07 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన రోడ్డును,శుక్రవారం   జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గార్ల తో కలిసి జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్ గారు రిబ్బన్ కట్ చేసి  ప్రారంభించారు.

ఈ సందర్భంగా  ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ    కె.సురేష్ కుమార్ ఐపిఎస్ గారు మాట్లాడుతూ…  పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా రొంపల్లి నుండి గుండాల వరకు ( సుమారు 07 కి.మి మేర)  రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. జూలై 02, నాడు ఇదే గుండాల కు ట్రాక్టర్ మరియు కాలి నడకన ఇక్కడకి అతి కష్టం మీద రావడం జరిగిందని, గుండాల ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టి లో ఉంచుకొని,  అప్పుడే గుండాల కు ఆరు  నెలల్లో పోలిస్  శాఖ ఆధ్వర్యంలో  రోడ్డు ఏర్పాటు చేస్తామని మాటిచ్చామని గుర్తు చేసుకున్నారు..గుండాల గ్రామానికి నవ స్వాతంత్య్రం సిద్ధించిందని,గిరిజన జీవితాల్లో వెలుగు నింపడమే పోలీసుల అంతిమ లక్ష్యం అని ఎస్పీ గారు తెలిపారు. ఈ రోడ్డు సౌకర్యం వల్ల గుండాల గ్రామానికి  విద్య,వైద్యం, మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ఎస్పీ గారు హర్షం వ్యక్తం చేశారు.పాఠశాల,కళాశాల  విద్యార్థులకు,ఆపదలో ఉన్న వారికీ అత్యవసర వైద్యం అందించే గోల్డెన్ అవర్ లోపు ఆసుపత్రి చేరేందుకు రోడ్డు సౌకర్యం అత్యంత ముఖ్యమని అన్నారు.జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతమైన గుండాల గ్రామానికి రహదారి నిర్మించే బాధ్యత స్వీకరించడం ఎంతో అదృష్టమని,ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగస్వాములు అవుతున్న ట్రాక్టర్స్ యూనియన్,సింగరేణి యాజమాన్యం,గుండాల గ్రామస్తులకు అభినందనలు తెలియజేశారు.కొత్తగా ఏర్పాటు అయిన రోడ్డు సౌకర్యం వల్ల గుండాల గ్రామస్తులకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు.ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసేనని,గ్రామంలో అపరిచిత వ్యక్తులు సంచరించినా,కొత్త వ్యక్తులు ఎవరైనా ప్రవేశించినా తగాదాలు,యాక్సిడెంట్లు జరిగినా,గంజాయి వంటి మత్తు పదార్థాలు సరఫరా వంటి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసువారికి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలకు ఉన్న బాధ్యతలను తెలియజేశారు.ప్రజల రక్షణలో ప్రతిస్పందన పోలీసులకు ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయం అని, పోలిస్ శాఖ తమ విధులలో పాటు, సేవ కార్యక్రమాలలో భాగం కావడం గొప్ప విషయం అని జడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎం.ఎల్. ఏ ఆత్రం సక్కు గార్లు పేర్కొన్నారు.ఎన్నో సంవత్సరాల నుండి రాకపోకలకు అవస్థలు పడుతున్న గుండాల గ్రామస్తులు పోలీసుల ఆధ్వర్యంలో నిర్మించి, ప్రారంభించిన  ఈ రోడ్డు  ఎంతో ఉపయోగపడుతుందని,గ్రామస్తులు తమ  జీవితాలు మెరుగుపడనున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర రావు ,జిల్లా అదనపు ఎస్పి ( ఎ .ఆర్) భీమ్ రావు, ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీలు కరుణాకర్, నాగేందర్, తిర్యాని ఎస్ఐ చుంచు రమేష్, ఇతర సి.ఐ లు, ఎస్.ఐ లు,  ఎం. పి పి శ్రీదేవి, జెడ్పీటీసీ చంద్ర శేఖర్, సర్పంచ్ జంగు బాయి, ఎంపిటిసి లక్ష్మి, గుండాల గ్రామ ప్రజలు,ఇతర పోలీస్ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.