పథకాల అమలులో ముందున్న తెలంగాణ

ఖమ్మం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేయనున్న సీతారామ ప్రాజెక్ట్‌కు నిధుల కొరత తీరిపోయిందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ అన్నారు. ఈ నెలాఖరు నాటికి సీఎంను జిల్లాకు తీసుకువచ్చి మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తామని మంతంరి తుమ్మల వెల్లడించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పూర్తయితే గోదావరి నీటితో జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలందరికీ చేరుతున్నాయనడానికి పథకాలే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ప్రభుత్వ ప్రయోజనాలను ప్రజల ఇళ్ల ముందుకే వెళ్లి నేరుగా లబ్ధిదారులకు అందజేసిన పాలకులు గతంలో ఎవరైనా ఉన్నారా..? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న ముఖ్యమంత్రిఅసాధ్యాలను సైతం సుసాధ్యం చేసే నాయకుడన్నారు. ఆడబిడ్డ పేద తల్లిదండ్రులకు భారం కాకుండా పెళ్లి సమయంలో ఆర్థిక భరోసా కల్పించాలని సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.