పదకొండవ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 4 : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక నిరసన సమ్మె గురువారానికి 11వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వీఆర్ఏలు పాదయాత్రగా వెళ్లారు. ప్రభుత్వ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వీఆర్ఏలు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వీఆర్ఏల మండల ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వము తమకు కచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు సమ్మె కొనసాగుతునే ఉంటుందని ఆయన అన్నారు. నిరసన కార్యక్రమంలో వీఆర్ఏలు నాగేష్, శ్రీలత, మహేశ్వరి, పద్మమ్మ, సింగోటం, మన్నెం, భీమన్న, నర్సింలు, నాగరాజు, బీసన్న, శేఖర్, మహేష్, నరసింహ, హుస్సేన్, వెంకటేష్, పరుశరాముడు, భాష తదితర గ్రామాల వీఆర్ఎలు పాల్గొన్నారు.