పదేళ్లలో సభలకు ఎంత ఖర్చు చేశారో చెప్పిండి

ఆ లెక్కలు చెప్పిన తరవాత మమ్మల్ని అడగండి

కాంగ్రెస్‌కు ఎంపి సీతారాం నాయక్‌ సవాల్‌

వరంగల్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): టిఆర్‌ఎస్‌ ప్రగతినివేదన సభ ఖర్చులపై రాద్దాతం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ముందుగా అధికరాంలో ఉన్న పదేళ్ల కాలానికి ఎన్ని సభలు పెట్టారో..దానికి సబంధించిన ఖర్చులను ప్రకటించాలని మహబూబాబాద్‌ ఎంపి సీతారాం నాయక్‌ డిమాండ్‌ చేశారు. రాజకీయ పార్టీగా సభలు పెట్టుకుని ప్రజలకు నిజాలు చెప్పాల్సి ఉంటుందన్నారు. నాలుగున్నరేళ్లుగా సిఎం కెసిఆర్‌ చేపట్టిన అభివృద్దిని ప్రజలకు తెలపాల్సి ఉందని, అందుకోసం ఇంటింటికీ తిరిగి చెప్పలేమన్నారు. అందుకే సభ ద్వారా ప్రజలకు వివరిస్తామని అన్నారు. చేసింది చెప్పుకోవడం మా హక్కు అన్నారు. తెలంగాణ ఏర్పడ్డతరవాత ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకుని ముందుకు వెళుతున్న ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు. అందుకే దేశ చరిత్రలోనే ప్రగతి నివేదన సభ ఓ మైలురాయిలా నిలుస్తుందని చెప్పారు. కొంగర కలాన్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది తరలిరానున్నారని వివరించారు. వారం రోజులుగా గ్రామగ్రామాన తెరాస ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు చెమటోడ్చి పనిచేస్తున్నారని వెల్లడించారు. జనాల తరలింపునకు వాహనాలను సమకూర్చుతున్నామని చెప్పారు. ఇంతపెద్ద స్థాయిలో ప్రగతి నివేదన సభ ఎందుకుని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారని, వారికి మేం ఈ సభ ద్వారం జవాబు చెప్పబోతున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 24 గంటలూ ఉచిత విద్యుత్తు సరఫరా లేదు. రైతులకు ఎకరాకు రూ.8 వేల పంట పెట్టుబడి సాయం మరెక్కడా అందించడం లేదు. మన రాష్ట్రంలోనే రైతు బీమా ఒక గుంట భూమి ఉన్న రైతుకు సైతం రూ.5 లక్షల బీమా ఇలా వినూత్న పథకాలతో సంక్షేమ పాలనలో దూసుకెళుతున్నామని సభలో సీఎం కేసీఆర్‌ చెబుతారన్నారు. సబ్సిడీలపై వ్యవసాయ పరికరాలు అందిస్తున్న సంగతి కాంగ్రెస్‌ వాళ్లకు తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, భాజపా పాలిత రాష్ట్రాలలో ఇలాంటి పథకాలను గతంలో అమలు చేశారా, చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నీటిని వినియోగించుకునేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. అందుకే ప్రాజెక్టులు రీడిజైనింగ్‌ చేశామన్నారు. ముందస్తు ఎన్నికలు ఉంటే కాంగ్రెస్‌కు భయమెందుకని ప్రశ్నించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో కాంగ్రెస్‌దే అధికారమని చెబుతూ ముందస్తు ఎన్నికలు ఎందుకుని ప్రశ్నించడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు.