పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం,మార్చి12 జ‌నంసాక్షి): ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యాప్తంగా అవసరమైన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా
విద్యాశాఖాధికారి అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరికలు ఇప్పటికే అందాయి. పరీక్షల సమయంలో కొంత
మంది సిబ్బంది విద్యార్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు కూడా కొన్ని కేంద్రాల్లో చూచిరాతలు రాస్తున్నారు. ఇలాంటి వాటిపై ఇక నుంచి ఉక్కు పాదం మోపనున్నారు. పరీక్షల విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారికి, చూచిరాతలకు సహకరించే పరీక్ష సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలను కట్టుదిట్టంగా అమలు చేయటానికి ఈ చట్టాన్ని ఉపయోగించనున్నట్లు  తెలిపారు. పరీక్ష నియమాల ఉల్లంఘన జరిగినా, జరపటానికి ప్రయత్నం చేసినా ఐపీసీ సెక్షన్లను అనుసరించి 3 నుంచి డేళ్ల జైలు శిక్ష విధిస్తారు.