పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 16 వ తేదీ నుంచి  జరుగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులు
అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు పలు సూచనలు జారీ చేశారు.  పరీక్షా ప్రారంభానికి ఒక గంట ముందు నుంచే అంటే ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతి ఇస్తారు.  విద్యార్థులు స్కూల్‌ యూనిఫాంలో పరీక్షా కేంద్రాలకు అనుమతించరు. విద్యార్థులు తమ వెంట హాల్‌ టికెట్‌, పరీక్ష ప్యాడ్‌ను తీసుకు రావాలి.  సెల్‌ఫోన్‌లు ఇతర ఎలక్టాన్రిక్‌ పరికరాలు పరీక్ష హాల్‌లోకి అనుమతించరు.  విద్యార్థులు హాల్‌ టికెట్లను ఇంటర్‌నెట్‌ నుంచి  డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  పరీక్షలు జరిగేటప్పుడు మారుమూల గ్రామాల్లోని కేంద్రాలకు బస్సులు నడపాలని కలెక్టర్‌ సూచించారు.