పనిచేయని అధికారులను తొలగించాలి: మంత్రి ఆదేశం

నిజామాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి):గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించకుండా, పనిచేయకుండా పెత్తనం చెలాయించే క్షేత్ర సహాయకులను తొలగించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సోమవారం బీర్కూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధి హావిూ పథకంపై రెండు గంటలపాటు ఆయన సవిూక్ష నిర్వహించారు. ఉపాధి సిబ్బందిని పిలిచి వారి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో జాబ్‌కార్డులు, ఉపాధి పనుల కల్పన, వేతనాల చెల్లింపులపై ఆరాతీశారు. ఈ నిర్లక్ష్యం వల్ల గ్రామాల్లో కూలీలకు పనులు కలిగించడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో నిజామాబాద్‌ ఉపాధి పనులు కల్పించడంలో చాలా వెనుకబడి ఉందని రాష్ట్ర ఉపాధి హావిూ కమిషనర్‌ నివేదిక ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మ్లలెల విూనా, జడ్పీటీసీ కిషన్‌నాయక్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌, ఎంపీడీవో మల్లిఖార్జునరెడ్డి, జిల్లా గ్రంథాలయ లద్ఘిర్మన్‌ శ్రీనివాసయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.బీర్కూర్‌ శివారులోని నూతనంగా వెలిసిన తెలంగాణ తిరుమల దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో చేపట్టారు. ఈ హుండిలో రూ.151,281లు భక్తులు కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. ఆదివారం నిర్వహించిన శ్రీవెంకటేశ్వర ఆలయ విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శంభురెడ్డి, కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వరరావు, ద్రోణవల్లి సతీష్‌, అశోక్‌, అప్పారావు, పెరక శ్రీనివాస్‌ కృష్ణరెడ్డి తదితరులు ఉన్నారు. ఇదిలావుంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవనభృతిని కల్పించాలని బీడీ కార్మికులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి విన్నవించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవనభృతి కల్పిస్తామని ఎన్నికల్లో హావిూ ఇచ్చి ఇప్పుడు ఆంక్షలు విధించి అర్హులైన వారికి అన్యాయం చేస్తున్నారని వాపోయారు. జీవనభృతి ఆంక్షలపై చర్చిస్తున్నామని త్వరలో సమస్య పరిష్కరిస్తామని మంత్రి హావిూ ఇచ్చారు.