పర్యటకులకు బంపర్ ఆఫర్పర్యటకులకు బంపర్ ఆఫర్  దేశ విదేశీ టూరిస్టులకు అద్భుతమైన ప్యాకేజీలు

 

 

 

 

 

 

అందిస్తున్న ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్  కూకట్ పల్లి జనంసాక్షి :
వేసవి సెలవులు రాగానే రొటీన్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేసి కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉల్లాసంగా గడపాలనుకుంటారు. ఏడాదంతా పడిన శ్రమను మర్చిపోవడానికి ప్రకృతి ఎదలో ఒదిగిపోయి సేదతీరాలనుకుంటారు. పార్కులు, పార్టీలు, సినిమాలు, రిసార్టులకు భిన్నంగా సెలవులను బట్టి జాతీయ, అంతర్జాతీయ యాత్రలు చేయాలనుకుంటారు. ఈ ఆలోచన గలవారందరినీ దృష్టిలో పెట్టుకుని తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్ అర్.వి టూర్స్‌ – ట్రావెల్స్‌ కూకట్‌పల్లి ప్రధాన కార్యాలయంగా యాత్రికుల క్షేమమే ప్రధాన లక్ష్యంగా యాత్రికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించింది. యాత్రికులకు అనువైన ప్యాకేజీలు అందిస్తూ, చక్కగా సేదతీరేలా ప్రణాళికలను సిద్ధం చేశారు.దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలకు వచ్చే వేసవి కాలంలో విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని  ఆర్వి.టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రావెల్ ఎక్స్పో 2023 శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా పావన గంగా నది పుష్కరాలు, దేశ ఆధ్యాత్మిక యాత్రలు చార్‌ధామ్ ఇవి రెండూ ముందుగానే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పర్యాటకుల కోరిక మేరకు ట్రావెల్ ఎక్స్పో 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఆర్.వి రమణ తెలిపారు. ఇవే కాకుండా వేసవితాపాన్ని తట్టుకోవడానికి థాయిలాండ్ లోని ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఎన్. ఓకే ఎయిర్లైన్స్ వారు ఫిబ్రవరి 22న హైదరాబాదు నుండి ప్రత్యేక విమాన సదుపాయాన్ని కల్పిస్తూ పర్యాటకులకు అతి తక్కువ ధరల్లో థాయిలాండ్ సందర్శించే అవకాశం కల్పిస్తున్న మూలంగా కేవలం 31999 రూపాయలకే బ్యాంకాక్ టూర్ ని ఫ్లైట్స్ భోజనం వసతి తో మొదలైన అన్ని సౌకర్యాలతో అందిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు దేశంలో ఒకేసారి చార్ధామ్ యాత్ర గంగపుష్కరాలకు స్పెషల్ యాత్రలు అమర్నాథ్, కైలాసం మానస సరోవరం, మనాలి, కర్ణాటక, కాశి గయ ప్రయాగ, గుజరాత్, సిమ్లా, కాశ్మీర్ శ్రీనగర్, కాశీ మొదలైన యాత్రలతో పాటు అంతర్జాతీయ యాత్రల ప్యాకేజీలనూ అందిస్తోంది. బ్యాంకాక్, పట్టాయ, సింగపూర్, మలేషియా, దుబాయ్, బాకు, ఆల్మట్టి,గాంగ్టక్ డార్జీలింగ్ లాంటి విహారయాత్రలకు భారీ డిస్కౌంట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్ ను సంప్రదించండి 7032666921