పల్లెల్లో మావోయిస్టు కదలికలపై అనుమానాలు?

వరంగల్‌/ఆదిలాబాద,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): ఉత్తరతెలంగాణ ప్రాంతంలో  గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టుల కదలికలు మళ్ళీ మొదలు అయ్యాయా…..  అంటే ఈ అనూమానలకు బలంచేకురుతుంది. మావోయిస్టు కార్యకలాపాలకు కంచుకోటగా నిలిచిన తెలంగాణ ప్రాంతంలో కొద్ది రోజులగా అన్నల కదిలికలు క్రమంగా  తగ్గుతూవచ్చాయి.  మావోయిస్టులకు పట్టున్న తెలంగాణ ప్రాంతంలో ….ఉత్తర తెలంగాణ పాత్ర మరువ లేనిది.  ఉద్యమ సమయంలో కూడా అంతగా పట్టులేని వారు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో మళ్లీ తమ కదలికలను మొదుల పెట్టారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌ తరవాత మళ్లీ పట్టు కోసం మావోల కదలికలు మొదలయ్యాని సర్వత్రా చర్చ జరుగుతుంది. దీంతో వరంగల్‌ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. మరో పక్క అడవులలో కూబింగ్‌ నిర్వహిస్తూ అడవుల్లో నక్సల్స్‌ కదలికలపై గాలింపులను ముమ్మరం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మావోల ఏజెండానే  తమ పార్టీ  ఎజెండా అని ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్పడం జరిగింది.  అంతేకాకుండా మావోయిస్టుల కదలికలపై పకడ్బంది నిఘా పెట్టిన పోలీసులు ఇన్‌ ఫార్మర్‌  వ్యవస్థను పటిష్టం చేసుకొని మావోల ఆగ్రనేతలను  మట్టుబెట్టారు. వీటితో

పాటు మరో పక్కా  మావోయిస్టు లొంగుబాట్లను సైతం ప్రోత్సహించారు. దీంతో మావోయిస్టులకు సేఫ్‌ జోన్‌ అయిన ఉత్తర తెలంగాణ నుండి మావోలు పక్క రాష్ట్రమైన చత్తీస్‌ ఘడ్‌ తో పాటు  ఒరిస్సా, జార్ఖాండ్‌, పశ్చిమ బెంగాల్‌ , మధ్య ప్రదేశ్‌ లకు షెల్టర్‌ లు  మార్చారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా సద్దుమణిగాయి. తమ ఉనికి కోసం … అడపాదడప కరపత్రాలను విడుదల చేస్తూ ప్రజావ్యతిరేకార్యకలపాలు, భూకబ్జాలకు పాల్పడిన వారిని ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదనే హెచ్చరికలు చేస్తూ వచ్చారు. అయితే కేవలం హెచ్చరికలు…. కరపత్రాలు విడుదలకే పరిమతమైన మావోలు మళ్లీ తెలంగాణ ప్రాంతంలో పట్టుకోసం వ్యూహరచన చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడంతో మావోలు తమ కార్యకలాపాలకు మళ్ళీ  శ్రీకారం చుట్టారు. కార్యకలపాలను కొనసాగించడం కోసం పార్టికి సంబందించిన రిక్రూట్‌మెంట్‌లను చేస్తూ పార్టి బలోపేతం చేసే దిశగా మావోల కదలికలు ఉంటాయని పోలీసు నిఘా వర్గాలు అంచనా వేసి పోలీసులను అప్రమత్తంగా ఉండమని …ఇప్పటికే హెచ్చరికలు చేసినట్టు సమాచారముంది. అయితే పోలీసుల నిర్బంధం పెరుగుతుందే తప్ప …నక్సల్స్‌ కార్యకలాపాలను చూస్తు సహించే అవకాశాలు  కన్పించడం లేదు.