పవర్‌లూం కార్మికులకు శాశ్వత ఉపాధి

nz6barcw* మంత్రి కేటీఆర్ హామీ
* తమిళనాడు తరహాలో జనతా వస్త్రాలు
* నేతన్నల కోసం మూలనిధి
* వేజ్‌బోర్డు ద్వారాకూలీరేట్లు
* సిరిసిల్లలో సమ్మె విరమణ

సిరిసిల్ల: నేత కార్మికులకు శాశ్వతంగా ఉపాధి కల్పించేందుకు కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్‌ను సాధిస్తానని తెలంగాణ ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సిరిసిల్లలో నేత కార్మికులు పది రోజులుగా చేస్తున్న సమ్మె నేపథ్యంలో నలుగురు నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఘటనపై స్పం దించిన మంత్రి కేటీఆర్.. గురువారం కేరళ నుంచి బయలుదేరి నేరుగా సిరిసిల్లకు చేరుకున్నారు. ఆర్డీవో ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల నేత కార్మికుల శాశ్వత ఉపాధికి మెగా పవర్‌లూం క్లస్టర్‌ను సాధిస్తానని, ఈ నెల 12న ఎంపీ వినోద్‌కుమార్‌తో కలసి కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్తానన్నారు. వచ్చే బడ్జెట్‌లో సిరిసిల్లకు నిధులు కేటాయించే విధంగా కేంద్ర ఆర్థికమంత్రిని కలుస్తామని చెప్పారు.

సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లో సమ్మె యోచనను విరమించాలని కోరారు. పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రూ.ఏడుకోట్ల సబ్సిడీని మంజూరు చేయిస్తానన్నారు. ఏభైశాతం విద్యుత్ రాయితీ పార్క్‌లో అమలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ పేదలకు జనతా వస్త్రాలు పంచేం దుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. ఈవిధంగా సిరిసిల్ల నేతన్నలకు దీర్ఘకాలిక ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. రాజీవ్ విద్యామిషన్‌లో స్కూల్ యూనిఫారమ్స్, సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు డ్రెస్‌లు, ఆశా వర్కర్లు, ఆస్పత్రులకు సిరిసిల్ల వస్త్రాలు కొనుగోలు చేసే విధంగా మార్కెటింగ్ వసతి కల్పిస్తామన్నారు. సిరి సిల్ల ఆసాములకు పావలావడ్డీ రుణవసతి కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. నేతన్నల కోసం వేజ్‌బోర్డు ఏర్పాటు చేసి వేతనాలు ఎప్పటికప్పుడు పెరిగేలా చూస్తామని స్ప ష్టం చేశారు. సిరిసిల్లలో నేతన్నల కూలి ఒప్పందం జరిగిం ది. సమ్మె విరమించి శుక్రవారం నుంచి కార్మికులు పనుల్లోకి వెళ్లాలని కార్మికసంఘాలు, ఆసాములు ప్రకటించారు.