పసుపురైతు సమస్యలను పట్టించుకోని బిజెపి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి):పసుపు బోర్డు సాధన, మద్దతు ధర కోసం మరో పోరాటానికి పసుపు రైతులు సిద్ధం కావాలని తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ నాలుగేళ్ల పాలన పూర్తయినా పసుప పంటకు బోర్డు, మద్దతు ధరల ఊసెత్తడం లేదన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలు పసుపు పంటకు ప్రత్యేక బోర్డు, మద్దతు ధరపై హావిూలు ఇచ్చాయన్నారు. గడిచిన నాలుగేళ్లలో 20 మంది కేంద్ర మంత్రులను కలిసి రైతుల డిమాండ్ల గురించి విన్నవించామన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వివరించాలని తాము చేసిన ప్రయత్నం ఫలించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన బీజేపీ

జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసే అవకాశం కూడా తమకు దక్కలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తాము ఖండిస్తున్నామన్నారు. పసుపు రైతుల డిమాండ్ల సాధనకు కార్యచరణను రూపొందిస్తామన్నారు. దీంట్లో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం పసుపు రైతులపై శ్రద్ధ వహించకపోవడంతోనే ఈ సమస్యలు అపరిష్కుత్రంగా ఉన్నాయని విమర్శించారు.