పాతబస్తీలో వెలుగుచూసిన ఘోరం

స్నేహితుడితో కలిసి భర్త లైంగికదాడి

పలుమార్లు మత్తుమందు ఇచ్చి దాష్టీకం

11నెలల పాటు బాధితురాలికి నరకం

చార్మినార్‌, మార్చి 13: అందగాడు.. పైగా విదేశాల్లో చదువుకున్నవాడు భర్తగా లభిస్తే.. ఏ అమ్మాయికైనా అంతకన్నా ఏం కావా లి? తనకూ అలాంటివాడు భర్తగా వస్తున్నాడని తెలిసి, ఆ అమ్మాయి కూడా కలల లోకంలో విహరించింది. అయితే.. తొలిరాత్రే ఆమెకు అత్యంత ఘోరమైన, జుగుప్సాకరమైన అనుభవం ఎదురైంది. గదిలోకి అడుగుపెట్టగానే.. అక్కడ ‘మూడోవ్యక్తి’ కనిపించడంతో షాక్‌తింది. బయటకు పరుగెత్తబోతే భర్తే అడ్డుపడ్డాడు. ‘‘పర్లేదు.. లైట్‌తీస్కో నా ఫ్రెండే’’నంటూ బతిమాలాడు! ఇదేం పాడుపని అని ఆమె ఛీత్కరిస్తే.. భయపెట్టాడు! స్నేహితుడితో కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అలా తొలిరాత్రే ఓ కాళరాత్రిగా మారిన ఆ యువతిపై అనేకసార్లు ఇలానే దాష్టీకానికి పాల్పడ్డాడా షాడిస్టు. అలా అత్తింట్లో 11నెలల పాటు నిత్యనరకాన్ని చవిచూసిందామె. చివరికి ఓపిక నశించి ఈ నెల 11న కంచన్‌బాగ్‌ పోలీసులను ఆశ్రయించింది. భర్త, అతడికి సహకరించిన కుటుంబ సభ్యులు, స్నేహితుడిని కఠినంగా శిక్షించాలని వేడుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి పురానా హవేలీ సౌతజోన్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సత్యనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన ఓ యువతి(21) డిగ్రీ పూర్తిచేసింది. 2014 ఏప్రిల్‌ 15న అదే ప్రాంతానికి చెందిన సలాముద్దీన్‌ అనే యువకుడితో ఆమెకు వివాహం జరిగింది. కట్నకానుకలు భారీగానే ముట్టజెప్పారు. తొలిరాత్రి గదిలోకి కాలుపెట్టిన ఆమె.. భర్త ప్రోద్బలంతో ‘ఆ మూడో వ్యక్తి’ కబళిస్తుంటే మూగ గా రోదించింది. తర్వాత భర్తకు డ్రగ్స్‌తో పాటు, పలువురితో వివాహేతర సంబంధాలున్నాయని తెలిసి రోదించింది. కొన్నాళ్లకు భర్త సలాముద్దీన్‌ ఆసే్ట్రలియా వెళ్లినా.. ఆమెకు వేధింపులు ఆగలేదు. నీలిచిత్రాల వీడియోను ఆమెకు వాట్స్‌పలో పంపుతూ పైశాచికానందం పొందేవాడతను. అటు అదనపు కట్నం కోసం అత్తా, ఆడపడుచులు వేధించసాగారు. కాగా ఈ నెల 4న ఆసే్ట్రలియా నుంచి వచ్చిన భర్త.. ఆమెకు మత్తుమందు ఇచ్చి స్నేహితుడితో కలసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘోరాన్ని ఆమె.. అత్త, ఆడపడుచుల ఎదుట వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆమెకు భర్త ఇటీవల కొత్త ప్రతిపాదన తెచ్చాడు. పెళ్లయి ఇన్నిరోజులైనా పిల్లలు పుట్టడం లేద ని, ఓ ఖాజాబాబాతో శృంగారంలో పాల్గొంటే తెలివైౖన పిల్లలు పుడతారంటూ ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె అత్త, ఆడపడచులు వత్తాసు పలికారు. సలాముద్దీన్‌ ఓ రోజు హఠాత్తుగా సదరు బాబాను ఇంటికే తీసుకొచ్చాడు. కాగా యువతి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువతి భర్త, అత్తను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న భర్త స్నేహితుడు, బాబా కోసం గాలిస్తున్నట్టు డీసీపీ సత్యనారాయణ తెలిపారు.