పాత పెన్షన్‌ పునరుద్దరించాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం(టీటీయూ) జిల్లా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ విధానంతో ఉద్యోగుకలు పెన్షన్‌ అన్నది
లేకుండా పోయిందని ఆందోళన  చెందారు.  కొత్తగా ఏర్పాటుచేసిన గురుకులాల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పరిధిలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి వారిని నియమించాలని విజ్ఞప్తిచేశారు. జిల్లాలోని ఉపాధ్యాయులతోపాటు విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. పాత పింఛను పునరుద్ధరణకు సంఘం కృషిచేస్తోందని చెప్పారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించడానికి  సంఘం రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి కేంద్ర ¬మంత్రికి నివేదించినట్లు వెల్లడించారు.