పాపకొల్లులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

జూలూరుపాడు డిసెంబర్ 9 జనంసాక్షి: మండల పరిధిలోని పాపకొల్లు గ్రామం పరిధిలో జూలూరుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడియా సోనీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని సంఘం పరిధిలో జూలూరుపాడు, పాపకొల్లు, కాకర్ల, పడమట నర్సాపురం గ్రామాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దళారులకు పండించిన పంటను అమ్మి రైతులు మోసపోవద్దని, తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎ గ్రేడ్ ధాన్యం ధర రూ2060లు. కామన్ గ్రేడ్ ధర రూ2040లుగా నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు మనోబోలు తిరువెంగళరాజు, పాపిన్ని వెంకయ్య, ఎంపీటీసీ దుద్దుకూరి మదూసుధరావు, రైతు సమన్వయ కమిటీ రామిశెట్టి రాంబాబు, మానిటరింగ్ అధికారి కిషోర్, ఏఈఓ ప్రసాద్, రైతులు, సంఘం సిబ్బంది పాల్గొన్నారు.