పారదర్శక పాలన అవసరం

C

– సమగ్రసమాచారనిధి ఏర్పాటు

– ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి):  సమగ్ర పౌర సమాచార నిధి ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌  సవిూక్ష నిర్వహించారు. గత ప్రభుత్వాల పాలనలో పారదర్శకత లోపించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శనివారం ఆయన సమగ్ర పౌర సమాచార నిధి ఏర్పాటుపై సవిూక్ష సమావేశం నిర్వహించారు. విూ సేవా ప్రతినిధులు, సీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్లే అవకతవకలు జరుగుతున్నాయి. పాలనలో ప్రజలను భాగస్వాములు చేస్తే ఎంత మార్పునకైనా సహకరిస్తారు. పౌరులు సమాచారం ఒకే చోట లభించే కొత్త అప్లికేషన్స్‌ రూపొందించాలి. క్లిష్ట సమయాల్లో విశ్లేషించుకునేలా సమగ్ర సమాచారం లభించాలి. పోలీసులతో పాటు అన్ని విభాగాల్లోనూ ఈ అప్లికేషన్‌ ఉపయోగించాలి. సంక్షేమ పథకాల అమలులో అవకతవకల నిర్మూలన కోసమే సమగ్ర సమాచార నిధి’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్లే అవకతవకలు జరుగుతున్నాయి. పాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తే ఎంతటి మార్పుకైనా వారు సహకరిస్తారని అన్నారు.  పౌరుల సమాచారం ఒకే చోట లభించే కొత్త అప్లికేషన్స్‌ రూపొందించాలి. క్లిష్ట సమాయాల్లో విశ్లేషించుకునేలా సమగ్ర సమాచారం లభించాలి. పోలీసులతో పాటు అన్ని విభాగాల్లోనూ ఈ అప్లికేషన్‌ను ఉపయోగించాలని తెలిపిన సీఎం సంక్షేమ పథకాల అమలులో అవకతవకల నిర్మూలన కోసమే సమగ్ర సమాచార నిధిని ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుడ్‌ గవర్నెన్స్‌కు ఇది ఎంతగానో దోహదపడగలదన్నారు.