పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం

కరోనా లాక్‌డౌన్‌తో పారిశుద్ధ్యానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ మామూలు స్థితికి వచ్చారు. మంచి అలవాటు అలాగే కొనసాగిస్తారని, మంచికి అలవాటు పడతారిన భావించారు. అయితే అదంతా తాత్కాలిక మే అఇ రుజువు చేస్తున్నారు. కరోనా భయం వెన్నాడడంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. చేతులు కడుక్కోవడం,ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చేశారు. కానీ మళ్లీ యధాతథస్థితికి రావ డానికి ఎంతోకాలం పట్టలేదు. ఇల్లుతో పాటు ఇపపుడు పరిసరాలను కూడా పట్టించుకోవడం మానేశారు. గ్రామాలు మొదలు పట్టణాలన్నీ మళ్లీ మురికి కూడాపాలుగా మారుతున్నాయి. పారిశుధ్య బాధ్యత తమది కాదన్న భావనలో ప్రతి ఒక్కరూ ఉన్నట్లుగా ఉంది. తాము చెత్తాచెదారం తీసి అవతల పడేస్తే సఫాయివారు వచ్చి తీసుకుని పోతాన్న భావనలో ఉన్నారు. ఇదే ఇప్పుడు కొంపముంచుతోంది. గ్రామాలు మళ్లీ అపరిశుభ్ర తలోకి జారుకుంటున్నాయి. దీంతో దోమలు,ఈగలు పెరుగుతున్నాయి. మురుగునీరు కాలువలై ప్రవహి స్తోంది. దీంతో సీజనల్‌ వ్యాధులు మరోమారు విజృంభిస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు మురుగునీరు ఏరులై పారుతోంది. దీంతో దోమల విజృంభణ..మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు విజృంభించడం.. పల్లెల్లో జ్వరాలతో ప్రజలు మంచం పట్టడం జరుగుతోంది. ఇరు తెలుగు రాష్టాల్ల్రో అడపాదడపా వర్షాలతో ఇప్పుడు జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారు. ఎక్కడిక్కడ ప్రజలు స్థానికంగానే వైద్యం తీసుకుంటున్నారు. జ్వరాలు తగ్గకపోతే సవిూప ఆస్పత్రులకు వెళుతున్నారు. పారిశుధ్యం కోసం విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం కనిపించడం లేదు. ఎక్కడిక్కడ మురుగునీరు రోడ్లపైనే ఇంటి చుట్టు పక్కల ప్రవహిస్తోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. ప్రజలతో పాటు అధికారులు, సిబ్బంది తమకెందుకులే అన్న ధోరణి ప్రదర్శిస్తున్నారు. ప్రజలను ఎవరైనా అడితే అధికారులు చూసుకుంటారని, వారికే చెప్పండన్న సమాధానం చాలాచోట్ల వస్తోంది. వైద్యఆరోగ్య, పంచాయతీరాజ్‌, గ్రావిూణ నీటిపారుదల, ఇతర శాఖల అధికారులు గ్రామాలకు వెళ్లి చర్యలు తీసుకున్నా సమస్యలు మళ్లీ మొదటికి వస్తున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణకు గ్రామ సర్పంచులు, కార్యదర్శులు ఏమాత్రం సహకరించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పంచాయితీల్లో డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయించినా … బిల్లులు వస్తాయో, రావనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రామ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలి. అయితే వారు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సీజన్‌కు ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికార యంత్రాంగం ప్రకటించినా పలు జిల్లాల్లో వ్యాధులు ముసురుకుంటున్నాయి. అధికారులను అప్రమత్తం చేసినా వారు చాలాగ్రామల్లో ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రధానంగా గిరిజన గూడాల్లో పరిస్థితి యధాతథంగా ఉంది. సీజన్‌కు ముందే గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. ప్రతి గ్రామంలోనూ పారిశుధ్యం మెరుగు పరచాలని, ఎక్కడికక్కడ కాలువల్లో పూడికతీసి మురుగు నీరునిల్వ లేకుండా చేయడం ద్వారా దోమలను నిర్మూలించాలని సూచించారు. దోమల వ్యాప్తికి కారణమైన లార్వాను సంహరించడానికి ఆయిల్‌బాల్స్‌ వేయాలని, అపరిశుభ్రత ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్‌, స్పే చేయాలని ఆదేశించారు. అయితే జిల్లాల్లో నామమాత్రంగానే చర్యలు చేపట్టారు. జిల్లాల్లో దోమల నివారణపై అధికార యంత్రాంగం గట్టి చర్యలే తీసుకుంది. అయితే పారిశుద్య లోపం పెద్ద శాంపంగా పరిణమించింది. అందరి అలసత్వం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీజనల్‌ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. అయినా జ్వరాలు పెరుగుతూ వచ్చాయి. రాష్ట్రస్థాయి అధికారులు కూడా విషజ్వరాలు పెరగడంపై అసంతృప్తి
వ్యక్తం చేశారు. సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం జాతీయ ఆరోగ్యమిషన్‌ ద్వారా ప్రతిపంచాయతీకి ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్నారు. వైద్యాధికారులు కేవలం గ్రామాల్లోకి వెళ్లి విషజ్వరాలపై జాగ్రత్తగా ఉండాలని ఉచిత సలహాలు ఇచ్చి వెనుతిరిగి వస్తున్నారు. విశాఖలో అత్యధికంగా డెంగ్యూ జ్వరాలు ఉన్నాయని ఎపి వైద్యారోగ్య శృాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ స్వయంగా సిఎం జగన్‌తో జరిగిన సీక్షలో వెల్లడిరచారు. ఇకపోతే అధికారులు లేదా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఏదో హడావిడి చేస్తున్నారు. ఉన్నతాధికారులు వస్తున్నప్పుడు మాత్రం తూతూమంత్రంగా చర్యలు తీసుకుని మిన్నకుండి పోతున్నారు. నిధుల ఖర్చుపై కాకిలెక్కలు చూపి పారిశుధ్యం నిధులు నొక్కేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో ఏమాత్రం పర్యవేక్షణ చేయడం లేదు. ఎవరికివారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. వీరి నిర్వాకం వల్లే గ్రామాల్లో పారిశుధ్యం పడకేసి విషజ్వరాలు పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపంతో పల్లెల్లో పారిశుధ్యం పడకేసి దోమలు పెరిగి జ్వరాల బారిన పడుతున్నారు. అయినా పంచాయతీలు, అటు మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిధులు మాత్రం కరిగిపోతున్నాయి. జ్వరాలు వచ్చినప్పుడు మాత్రం ఆయా గ్రామాల్లో హడావుడిచేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి పంచాయతీకీ ఒక ఫాగింగ్‌ మిషన్‌ చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. ఎపిలో చాలాచోట్ల దోమల నివారణ కోసం క్రిమిసంహారక మందు పిచికారీ చేసేందుకు కొనుగోలు చేసిన ఫాగింగ్‌ పరికరాలు అటకెక్కాయి. అలాంట ప్పుడు ఫాగింగ్‌ ఎందుకు చేయడంలేదని ప్రశ్నిస్తే ఏదో సమాధానం ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్లు మాత్రం విషజ్వరాల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రధానంగా వైద్య సిబ్బందిని గ్రామాలకు తరలించి వైద్యం చేయాల్సి ఉంది. గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేయకపోతే ముందుముందు మరింతగా వ్యాధులు విజృంభించే ప్రమాదం లేకపోలేదు. ప్రధానంగా మలేరియా,డెంగ్యూ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.