పార్లమెంట్‌ సాక్షిగా బయటపడ్డ బిజెపి డొల్లతనం

పార్లమెంట్‌ సాక్షిగా బిజెపి డొల్లతనం బయటపడింది. రెండు అంశాల్లో బిజెపి నీళ్లు నమలాల్సి వచ్చింది. ఉభయసభల్లో గురువారం జరిగిన రెండు అంశాల్లో చర్చ సందర్భంగా అధికార బిజెపి ఆత్మరక్షణలో పడిందనే చెప్పాలి. ధరల పెరుగుదల, ఎపికి ప్రత్యేక¬దా అంశాలపై చర్చ సందర్భంగా అటు పెద్దల సభ రాజ్యసభలోనూ, ఇటు లోక్‌సభలోనూ నీళ్లు నమలాల్సిన స్థితి వచ్చింది. ఎంతో ఘనమైన పార్టీగా ప్రత్యేకతలు ఉన్న పార్టీగా పేరున్న బిజెపిలో సమాధానం చెప్పే ధైర్యం కల నాయకుడు లేకుండా పోయాడు. ధరలపై లోక్‌సభలో చర్చ సందర్బంగా ఆర్థికమంత్రి జైట్లీ సమాధానం పేలవంగానూ, సమర్థించుకునే తీరుగాను ఉంది. కేవలం ప్రశ్నకు ఎదురుదాడితో సమాధానం చెప్పాలనుకున్నారు. చాలా రోజుల తరవాత ధరలపై రాహుల్‌ ఎలాంటి భేషజాలు లేకుండా సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ధరలు అణచివేస్తామన్న వారు ఎందుకు ఆ పని చేయలేకపోయారో చెప్పలేకపోయారు. ప్రతి సంవత్సరంలో వర్షాలు కురిసే ముందు ధరల పెరుగుదల సహజంగా జరిగేదని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన సమాధానం పేలవంగానూ తప్పింఉకునేదిగాను ఉంది. తాను ఇస్తున్న సమాధానం ప్రజల కోసం కాకుండా రాహుల్‌ కోసం అన్న విధంగా జైట్లీ సమాధానం ఉంది. యూపీఏ ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగిందని, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ధరల పెరుగుదలను భూతద్దంలో ఏవిూ చూపనక్కరలేదని రాహుల్‌ ఆరోపణలపై సమాధానం ఇస్తూ వ్యాఖ్యానించారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు. ఉదాహరణకు కందిపప్పు ధరలు ఆనాడు 50 రూపాయలు ఉంటే 200 వరకు పెరిగింది. ఇదే విసయాన్ని రాహుల్‌ ప్రస్తావించారు. దీనిపై సమాధానం ఈ విదంగా ఉంటుందని ప్రజలు ఊహింఇ ఉండరు. ఇది కాంగ్రెస్‌ కోసం అడిగిన ప్రశ్న కాదు. సభ కాంగ్రెస్‌ కోసం నడుస్తున్నది అంతకన్నా కాదు. అయినా రాహుల్‌ ప్రశ్నలకు ఇంత తెలివి తక్కువ సమాధానం వస్తుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. లోక్‌సభలో చేపట్టిన ధరల పెరుగుదల చర్చలో ఆయన పాల్గొంటూ, కాంగ్రెస్‌ పాలనలో ద్రవ్యోల్బణం ఎంతో అధికంగా ఉందని ఎదురు దాడి చేశారు. మామూలుగా కొన్ని సరకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధాన్ని కలిగి ఉంటాయన్నారు. వివిధ సీజన్‌ల వారీగా కొన్ని ఉత్పత్తుల ధరలు మారుతుంటాయని అన్నారు. ద్రవ్యోల్బణం అదుపునకు తమ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందని జైట్లీ సభకు వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలన్నీ పసలేనివని తెలిపారు. పెట్రో ఉత్పత్తులకు సబ్సిడీ తగ్గించడం వల్ల మిగిలిన సొమ్ముతో రైతులకు ఫసల్‌ బీమా యోజనను అమలు చేస్తున్నామని, పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్‌ను అందిస్తున్నామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరినీ బీమా గొడుగు కిందకు తెస్తున్నామని, ఇంకా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలియజేస్తూ అసలు విషయమైన ధరల పెరుగదలపై సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఎన్డీయే హయాంలో ధరల పెరుగుదలపై ఆవేదన వ్యక్తంచేసిన రాహుల్‌ గాంధీ పలు ఆహార ధాన్యాల ధరలను, ప్రభుత్వం వసూలుచేస్తున్న పన్నులను ప్రస్తావించారు. రైతుల నుంచి ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత మొత్తం దోచుకుంటోందీ వివరించారు. ఈ సందర్భంగా పలుఉదాహరణలతో రాహుల్‌ మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా పప్పు ధరలో మార్కెట్‌ రేటుకు, రైతుల నుంచి కొనుగోలు రేటుకుమధ్య కేవలం 30 రూపాయల వ్యత్యాసం ఉండేదని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈవ్యత్యాసం 130 రూపాయలకు పెరిగిందని అన్నారు. దీనికి జైట్లీ సమాధానం చెప్పలేకపోయారు. ఇకపోతే రాజ్యసభలో ప్రత్యేక¬దాపై కేంద్రమంత్రి వెంకయ్య నీళ్లు నమిలారు. గతంలో విపక్షంలో ఉండి అదే రాజ్యసభలో ప్రత్యేక ¬దా కావాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడేమో ఓ దానిని దాటవేసందుకు, డొకతిరుగుడు సమాధానాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి తాను ఎపి నుంచి ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. ప్రత్యేక¬దాపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ బిల్లుపై చర్చను కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ ప్రారంభించారు. చర్చలో పాల్గొన్న సభ్యులు ఏపీకి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని ముక్తకంఠంతో కోరారు. దీనికి ఔననో లేదా కాదనో సాధానం ఇవ్వవచ్చు. కానీ అలా అధికార పార్టీ చేయలేకపోయింది. పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలు విషయంలో రాజ్యసభలో పలు పార్టీల సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమాధానంగా పేలవంగానూ , దాటవేసిదిగానూ ఉంది. కొన్ని అంశాలను విభజన చట్టంలో చేర్చలేదని, ప్రత్యేక ¬దాపై తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్టాల్ర నుంచి అభ్యంతరాలు వస్తున్నాయంటూ డొంకతిరుగుడు సమాధానం ఇచ్చారు. ప్రత్యేక¬దా లేకున్నా ఏడు మండలాలను విలీనం చేయడం సహా, ఎపికి ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐటీ సహా పలు విద్యా సంస్థలను మంజూరు చేశామన్నారు. విశాఖ, తిరుపతి విమానాశ్రయాలను విస్తరించామన్నారు. ప్రత్యేక ¬దాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావంటూనే ఆనాడు చట్టంలో ఎందుకుపెట్టలేదంటూ మెలిక పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా అటు ధరలపై జైట్లీ, ఇటు ప్రత్యేక¬దాపై వెంకయ్యలు ఇచ్చిన సమాధానాలు తప్పించుకునే విదంగా ఉన్నాయే తప్ప ప్రజలను తృప్తి పరచేలా లేవు. దీంతో బిజెపి తన డొల్లతనాన్ని బయట పెట్టుకుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.