పాలనలో తేడా గమనించండి : గంగుల

కరీంనగర్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఏళ్లుగా ఆంధ్రపాలకుల అణిచివేతకు గురై కడు పేదరికంలో మగ్గిన తెలంగాణలో సాంఘిక, ఆర్థిక అసమానతలు తొలిగేలా కేసీఆర్‌ పాలన అందించారని ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో గులాబీ శ్రేణులు నూతనోత్సాహం నెలకొందన్నారు. పేదరికాన్ని శాశ్వతంగా దూరంచేసేలా 76 అంశాలను ఎంపిక చేసి, అమలుచేశారన్నారు. ప్రాజెక్టులు ఆపేందుకు కోర్టుల్లో కేసులు వేసి జాప్యం చేసేందుకు పూనుకున్న కాంగ్రెస్‌ నేతలకు కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో ప్రభుత్వ దవాఖానల్లోనే 80 శాతానికి పైగా ప్రసవాలు జరుగుతున్నాయని వెల్లడించారు. బీడీ పరిశ్రమ చతికిలబడుతున్న సందర్భాన్ని గుర్తించి బీడీ కార్మికులకు రూ. వెయ్యి పింఛను ఇస్తూ కేసీఆర్‌ ఆదుకున్నారని గుర్తుచేశారు. దీంతో పేద మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. అభివృద్ధి ఎవరితో సాధ్యమవుతుందో అలోచించి నిర్ణయం తీసుకోవాని ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక, అంతకు ముందు అభివృద్ధిలో తేడాను గమనించాలని సూచించారు. డబుల్‌ బెడ్‌ రూంల లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బాంధవుడని నిరూపించుకున్నారన్నారు. నియోజక వర్గంలో వందలాది చెరువులను

అభివృద్ధి చేసుకున్నామనీ అన్నారు.