పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డు తగులుతూ నీచరాజకీయాలు చేసేవారికి తెలంగాణలో స్థానం లేదని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు జిల్లాకు చెందిన బిజెపి నేత నాగం జనార్ధన్‌ రెడ్డి కూడా పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతు కంటకులుగా మారిన వీరు ఎన్నిఎత్తులు వేసినా పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోలేరని, అవిభక్త పాలమూరు జిల్లాను కోనసీమను తలదన్నేలా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారని పునరుద్ఘాటించారు.

పాలమూరు రైఉతల బతుకులను మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అయితే కాంగ్రెస్‌ నేతలు అడుగడుగునా అడ్డు తగులుతున్నా, పనులు వేగంగా సాగుతున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. రాష్టాన్రికి కాంగ్రెస్‌ నేతలు శనిలా మారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికి కూడా జిల్లా ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. ప్రాజెక్టులకు అడ్డం పడటం కాదని, చిత్తశుద్ధి ఉంటే సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వంతో కలిసిరావాలని హితవుపలికారు.