పాలస్తీనాకు సహాయం నిలిపి వేసిన అమెరికా

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): పాలస్తీనా శరణార్ధులకు సహాయమందించే యుఎన్‌ సంస్థకు నిధులను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం అమెరికా ప్రకటించింది. వెస్ట్‌ బ్యాంక్‌, గాజాలో ప్రాజెక్టులకు ద్వైపాక్షిక సంయుక్త సహాయాన్ని తగ్గించిన వారం తర్వాత ఆమెరికా ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.యు.ఎస్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ (యుఎన్‌ఆర్‌డబ్ల్యూఎ) మొత్తం బడ్జెట్లో 30 శాతం నిధులను అమెరికా అందిస్తూ, కొన్ని సంస్కరణల డిమాండ్‌ చేస్తోంది. ‘ఈ అక్రమమైన దోషపూరిత ఆపరేషన్‌కు మరింత నిధులు ఇవ్వలేవు’ అని వ్రాతపూర్వక ప్రకటనలో ఆ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయం దాదాపు 300 మిలియన్‌ డాలర్ల ప్రణాళికా మద్దతును తగ్గిస్తుంది. దీనిపై నిరాశ, విచారం వ్యక్తం చేస్తున్నట్లు యుఎన్‌ఆర్‌డబ్ల్యూ ఒక ప్రకటన విడుదల చేసింది.