పాలిథిన్ నివారణ అందరి బాధ్యత: మున్సిపల్ చైర్మన్

పర్యావరణానికి హాని కలిగించే పాలిథిన్ నివారణ అందరి బాధ్యత అని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య నగర్ లో డాక్టర్ వీరా బ్రహ్మం పర్యావరణహితమైన కవర్ల తయారీ కేంద్రాన్ని ( బయో డిగ్రేడేబుల్) ఆదివారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ .ప్రారంభించారు.
తదనంతరం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 పాలిథిన్ కవర్లు వాడడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని, పర్యావరణహితమైన కవర్లు వాడాలని సూచించారు. ఈ కవర్లు త్వరగా కరిగిపోయి భూమిలో కలిసిపోయే గుణం కలిగి ఉంటుందని తెలిపారు.
షాపింగ్ మాల్స్,మార్కెట్ ప్రాంతాల్లో పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండే కవర్లు ను వాడాలని తెలిపారు.మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్  ని పలువురిని యాజమాన్యం పుష్ప గుచ్ఛం అందచేసి శాలువతో సన్మానించారు.కమిషనర్ అరిగెల సంపత్ కుమార్,కౌన్సిలర్ కొండ సబిత ,శ్రీధర్,మాజీ కౌన్సిలర్ పతికే శ్రీనివాస్, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.