పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

శరవేగంగా పైపుల నిర్మాణ కార్యక్రమాలు

ఖమ్మం,జూన్‌11(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టి ప్రతిగ్రామంలో స్వచ్ఛమైన గోదావరి జలాలను సరఫరా చేసేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. మిషన్‌ భగీరథతో గోదావరి, కృష్ణమ్మ జలాలు ఇక ఇళ్లల్లోకి రానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్‌ భగీరథపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకం పూర్తయితే మూడు జిల్లాలో అన్ని మండలాలకు నల్లానీరు సరఫరా కానుంది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. గోదావరి జలాలను ఇంటింటికీ నల్లాల ద్వారా అందించాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు ఏజెన్సీ గ్రామాల్లో కలుషిత నీరే దిక్కు. వాగులు వంకలు, చెలిమల విూద ఆధారాపడి ఏజెన్సీప్రజలు జీవించే వారు. వేసవి వచ్చిందంటే ఏజెన్సీ గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవించే వారు. కలుషితమైన వాగులు, వంకల నీరు తాగడం వల్ల తరచూ డయోరియాకు గురై మృత్యువాత పడే వారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ఇలాంటి సమస్యకు చెక్‌ పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ బృహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై ఏజెన్సీ ప్రజలు కలుషిత నీటిపై ఆధారాపడాల్సిన అవసరం లేకుండా రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఇల్లెందు కొరగుట్టవద్ద జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80శాతం పనులు పూరైనట్లు అధికారులు చెబుతున్నారు. మూడు జిల్లాల పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో సుమారు 600ల కిలోవిూటర్ల పైపులైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇల్లెందు మండలం, పట్టణంతో పాటు మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం, గార్ల, ఖమ్మం జిల్లా కామేపల్లి, కారేపల్లి మండలాలకు కోరగుట్ట నుంచి మంచినీరు సరఫర కానుంది. మొత్తం 5 మండలాల పరిధిలోని 438 గ్రామాలకు మిషన్‌ భగీరథ నీరు అందనుంది. గ్రౌండ్‌ లెవల్‌ బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ను 30 విూటర్లవ్యాసంతో 5 విూటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. కొండపైకి 336 విూటర్ల ఎత్తులో జీఎల్‌బీఆర్‌ పనులు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఎటువంటి విద్యుత్‌ అమరికలు లేకుండా గ్రావిటీ పైపులైన్‌ ద్వారా మంచినీటిని సరఫరా చేయనున్నారు. ఇప్పటికే కొరగుట్ట వద్ద సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తికావచ్చింది. సంపు, పంపు నిర్మాణాలు కూడా పూర్తికావస్తున్నాయి. పైపులైన్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనుకున్న సమయానికి పూర్తి చేయనున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఇంటింటికి మంచినీటి సరఫరా పథకం సాకారం కానుంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాలకు వరం కానుంది.