పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ.. బతుకమ్మ

మాజీ కార్పొరేటర్   దేప సురేఖభాస్కర్ రెడ్డి
ఎల్బీ నగర్ (జనం  సాక్షి ) ప్రపంచమంతా పూలతో దేవుణ్ని పూజిస్తే, పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ.. బతుకమ్మ అని  మాజీ కార్పొరేటర్   దేప సురేఖభాస్కర్ రెడ్డి అన్నారు.    మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ లోని  అలకాపురి కాలని వెల్ఫేర్  అసోసియేషన్ , అల్కాపురి మండలి మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో ఆడబిడ్డలంతా సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ వేడుల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న  ఆర్కే   పురం మాజీ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ  ( డిప్యూటీ ఫ్లోర్ లీడర్)   దేప సురేఖభాస్కర్ రెడ్డి  అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించింది మాట్లాడుతూ
 ప్రపంచమంతా పూలతో దేవుణ్ని పూజిస్తే, పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ.. బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక! ఉన్న ఆడబిడ్డలంతా సంబురంగా జరుపుకొనే ఘనమైన వేడుక. ప్రకృతినిఆరాధిస్తూ సాగే పూల పండుగ. బతుకమ్మలోని ఒక్కో పువ్వూ.. ఒక్కో ఔషధ గని. ఆరోగ్య ప్రదాయిని. క్రిమిసంహారిణి. అనిఅన్నారు  .ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని చాటి చెప్పే, తీరొక్క రంగులతో తీరొక్క పువ్వులతో జరిగే బతుకమ్మ పండగ సంబురాలను తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని కోరురారు..మహేశ్వరం నియోజకవర్గం లోని ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో  కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు…