పెట్టుబడుల ఆకర్షణలో కేటీఆర్‌ సక్సెస్‌

C

– మూడో రోజు అదేజోరు

– అమెరికాలో మంత్రి బిజీ బిజీ

హైదరాబాద్‌,మే26(జనంసాక్షి): తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. మూడోరోజు ఆయన అయోవా రాష్ట్రంలో పర్యటించి.. ఆ రాష్ట్ర గవర్నర్‌ టెర్రీ బ్రాన్‌ స్టర్డ్‌, ప్రపంచ ఆహార బహుమతి సంస్థ అధ్యక్షుడు కెన్నెత్‌ క్విన్‌ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయోవాలోని వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను ఆయన పరిశీలించారు. నూతన విధానాలతో వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న అయోవా రాష్టాన్రికి సంబంధిన సమాచారాన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌… కేటీఆర్‌కు వివరించారు. వ్యవసాయంలో తక్కువ రసాయనాలు ఉపయోగించడం, యాంత్రీకరణ విధానాలకే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం అనంతరం కేటీఆర్‌ డ్యుపాంట్‌ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో తాము ఇప్పటికే వ్యవసాయ రంగంలో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు డ్యుపాంట్‌ ప్రతినిధులు కేటీఆర్‌కు తెలిపారు. రెండు రోజుల పాటు పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించిన మంత్రి, మూడో రోజు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా వ్యవసాయం, ఇన్సూరెన్స్‌ రంగంలో అపూర్వమైన ప్రగతి సాధించిన అయోవా రాష్ట్రంలో పర్యటించిన మంత్రి, ఈ రెండు రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు, ఆధునిక పద్దతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేశారు.ప్రపంచ ఆహార బహుమతి సంస్థ అధ్యక్షుడు, అయోవా గవర్నర్‌ తోపాటు పలు సంస్ధలు, పరిశ్రమ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశం అయిన మంత్రి నూతన వ్యవసాయ విధానాలు, పుడ్‌ ప్రాసెసింగ్‌, ఇన్యూరెన్సు రంగాల్లో ఇక్కడి అనుభాన్ని ఉపయోగించుకునేందు ఏం చేయాలన్నదానిపై చర్చించారు. నూతన విధానాలతో వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న అయోవా రాష్ట్ర గవర్నర్‌ టెర్రీ భ్రాన్‌ స్టర్డ్‌ తో ఉదయం మంత్రి సమావేశం అయ్యారు. వ్యవసాయరంగంలో తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రికి గవర్నర్‌ వివరించారు. వ్యవసాయరంగంలో తక్కువ రసాయనాలు ఉపయోగించడం, యాంత్రీకరణ విధానాలకే తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టు గవర్నర్‌ తెలిపారు. టెర్రీ తో సమావేశం తర్వాత మంత్రి డ్యూపాంట్‌ (ఆబీఖనీనిబి) సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో తాము ఇప్పటికే వ్యవసాయ రంగంలో పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపిన డ్యూపాంట్‌ ప్రతినిధులు, కొత్తగా బయో సైన్సెస్‌ రంగంలో విస్తరించాలనుకుంటున్నట్టు తెలిపారు. అయోవా రాష్ట్రంలో రైతులకి సహకరించినట్టే తెలంగాణ రైతులకు కూడా సహకారం అందించాలని, నూతన వ్యవసాయ విధానాలను పరిచయం చేయాలని డ్యూపాంట్‌ ను కేటీఆర్‌ కోరారు. త్వరలోనే ఒక ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు పంపించాలన్నారు. డ్యూపాంట్‌ తో జరిగిన సమావేశ వివరాలను వ్యవసాయశాఖ మంత్రికి వివరిస్తానని మంత్రి చెప్పారు. తెలంగాణను సీడ్‌ బౌల్‌ అఫ్‌ ఇండియా గా తీర్చిదిద్దేందుకు తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో విత్తన పరిశోధన సంస్ధ అయిన డ్యూపాంట్‌, ఈ విషయంలో సహకరించాలని కోరారు. స్ధానిక రైతుల కోసం రైస్‌ స్కూళ్లు ఏర్పాటు చేసి అదర్శ వ్యవసాయ విధానాలను పరిచయం చేయాలన్నారు. డ్యూపాంట్‌ సంస్ధ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలన్నారు. తెలంగాణ రైతులకు అర్గానిక్‌ ఫార్మింగ్‌ లో సహాకారం అందించాలన్నారు. మంత్రి విజ్ఞప్తులు, సూచనలకు సానుకూలంగా స్పందించిన డ్యూపాంట్‌ ప్రతినిధులు తెలంగాణ రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు నూతన విధానాలతో వ్యవసాయం చేసే పద్ధతులను పరిచయం చేయడానికి మధ్యాహ్నం అయోవా రాష్ట్రంలోని కీలక వ్యక్తులు, సంస్దల ప్రతినిధులతో రౌండు టేబుల్‌ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచ అహార బహుమతి సంస్ధ అధ్యక్షుడు కెన్నెత్‌ క్విన్‌ ఈ సమావేశానికి హజరయ్యారు. అయోవా రాష్ట్రం సాధించిన ప్రగతి( ముఖ్యంగా వ్యవసాయ రంగంలో) కీలక పాత్ర పోషించిన పలు సంస్ధల ప్రతినిధులు అందుకు చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. రౌండు టేబుల్‌ కాన్ఫరెన్స్‌ లో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌, అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉందన్నారు. ఓ వైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూనే మరోవైపు దేశంలోని మెజార్టీ ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అయోవా రాష్ట్ర అనుభవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ముఖ్యమంత్రి కెసియార్‌ స్వయంగా ఒక రైతు అని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకి అధునాతన వ్యవసాయ విధానాలను పరిచయం చేయడంతో పాటు పుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో అయోవా రాష్ట్రం సాధించిన ప్రగతికి సంబంధించిన మెళకువలను తెలంగాణతో పంచుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ కోరారు. ఇక వ్యవసాయంతో పాటు ఇన్సూరెన్సు రంగానికి కేంద్రంగా ఉన్న అయోవా రాష్ట్రంలోని కంపెనీలతో ప్రత్యేకంగా చర్చించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లో భీమా నియంత్రణ సంస్ధ ఉందని, నగరానికి మరిన్ని ఇన్సురెన్సు, నాన్‌ బ్యాంకింగ్‌ సేవల సంస్ధలను తీసుకొచ్చేందుకు అయోవా రాష్ట్ర అనుభవాలను చెప్పాల్సిందిగా కోరారు.