పెన్షన్లు వస్తున్నాయన్న వృద్దురాలు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కేసీఆర్‌ సార్‌ లేకపోతే ఎన్నడో చచ్చిపోదుం అని ఓ వృద్ధురాలు ఉద్వేగ భరితంగా చెప్పింది. అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో దేవరకద్ర టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మణెమ్మ అనే వృద్ధురాలిని ఆయన పలుకరించారు. పెన్షన్లు వస్తున్నాయా? అని ఆమెను అడగ్గా.. ఈ విధంగా స్పందించింది. పెన్షన్లు వస్తున్నాయి.. మేము తింటుండం.. ఇచ్చిండు.. బతికినం.. బతకలేదు అంటలేం.. ఆయన పుణ్యాన బతుకుతున్నం.. లేకపోతే ఎన్నడో చచ్చిపోదుం. ఇప్పుడు ఎవరికీ ఓటేద్దాం అని ఒకాయన ప్రశ్నించగా.. అబ్బో కేసీఆర్‌కే ఓటేస్తాం అని ఆ వృద్ధురాలు తేల్చిచెప్పింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లోనూ చేరింది.