పెన్షన్‌ మాకెందుకు రద్దు?

నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): సీపీఎస్‌ పింఛను విధానాన్ని రద్దుచేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి జాక్టో డిమాండ్‌ చేసింది. పెన్షన్‌ లేకుండా రాజకీయ నాయకులే బతకడం లేదని, ఇక తామెలా బతుకు వెళ్లదీస్తామని అన్నారు. ఐదేళ్ల కాలపరిమితితో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు జీవితకాలం పింఛను ఇస్తుంటే 35 ఏళ్లకు పైగా పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ విధానం అమలుచేయడం అన్యాయమన్నారు. వారేమో అన్ని రకాల సౌకర్యాలు పెంచుకుంటూ, ఉద్యోగులను బలిపశువులను చేయడం తగదన్నారు. సీపీఎస్‌ విధాన అమలును కేంద్రం రాష్ట్రాలకు వదిలేసిందని, సమైక్య రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ విధానం తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగడం విచారకరమన్నారు. వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు సీపీఎస్‌ విధానంలో పనిచేస్తూ అభద్రతకు గురవుతున్నారని వాపోయారు.