పెరిగిన డిజీల్‌ పెట్రోల్‌ ధరలు

1699

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 15(జనంసాక్షి):పెట్రోల్‌ ధరలు మళ్లీ పేట్రేగిపోయాయి. సామాన్యులపై భారం మోపుతూ మళ్లీ పెరిగాయి. ఇటీవల పదిపైసలు, ఇరవై పైసలు తగ్గినట్టు అప్పుడప్పుడు కనిపించినా ఇప్పుడు లీటరుపై ఏకంగా పెట్రోల్‌పై రూపాయికిపైగా, డీజిల్‌పై రెండు రూపాయలకుపైగా పెరగడం గమనార్హం. లీటరు పెట్రోల్‌ ధరపై రూ. 1.34లు పెరగగా.. డీజిల్‌పై ఏకంగా రూ. 2.37లు పెరిగాయి. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.సాధారణంగా  రెండు వారాలకు ఒకసారి  అంతర్జాతీయ మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం రంగ ఇంధనసంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఒసి),  భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ దేశంలోని పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవిూక్షిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ ప్రభుత్వ సుంకాలు ,అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి విలువ, చమురు మార్కెటింగ్‌ కంపెనీల మార్జిన్లు ఆధారంగా ఇది ఉంటుంది.ఆయిల్‌ ధరలు పుంజుకోవడంతో దేశంలో మరోసారి పెట్రో వడ్డనే తప్పదనే సంకేతాల నేపథ్యంలో ధరలు పెరుగడం గమనార్హం. అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పెరగడంతో ఈసారి పెట్రోల్‌ ధరలు పెరగొచ్చనే అంచనా మార్కెట్‌ వర్గాల్లో నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ మాసాంతంలో జరిగే సవిూక్షలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు  పెట్రోల్‌,  డీజిల్‌ భారీగానే పెంచే అవకాశం ఉందని ఇంతకుముందే భావించారు. అయితే, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినప్పుడు కూడా.. పది పైసలు, ఇరవై పైసలు మాత్రమే తగ్గించి.. పెరిగినప్పుడు రూపాయి, రెండు రూపాయలు వడ్డించడాన్ని వినియోగదారులు తప్పుబడుతున్నారు.