పెరిగిన ధాన్యం దిగుబడులు

మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా పెరిగిందని అధికారులు అంటున్నారు. దీనికి తోడు ధాన్యం మద్దతు ధర కూడా పెరిగినందున రైతులు ఎక్కువ శాతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే విక్రయాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు అన్ని సౌ కర్యాలు కల్పించారు. ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేసి రైతులకు సకాలంలో వారి ఖాతాల్లో సొమ్ములను జమ చేశారు. రైతు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చిన కొను గోలు చేస్తోంది. అంచనాల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చే సేందుకు రైతులకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జీసీసీ,ఐకేపీ, కోపరేటివ్‌ సొసైటీల ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా అం దుబాటులోకి గన్నీ బ్యాగ్‌లను కూడా ఉంచారు. రైతులు విక్రయానికి తీసుకు వచ్చిన ధాన్యానికి వెంటనే పేమెంట్లు చేసేవిధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అధికారులు అన్నారు. రెండు లక్షల 30 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణ యించారు. ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రాజెక్టుల కింద వరి కోతలు జరగనందున చాలా ధాన్యం పొలాల్లోనే ఉండిపోయింది.