పేదలకు సహాయం చేసినప్పుడే ప్రజల్లో గుర్తింపు – ఎన్నారై నల్లమల చంద్రమౌళి సంస్కరణ సభ

 

 

 

 

 

హుజూర్ నగర్ జనవరి 31 (జనం సాక్షి) : సమాజంలోని పేదలకు సహాయం చేసినప్పుడే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ సుందరి కరణ్ కుమార్, వ్యాపారవేత్త నల్లమల సుబ్బారావు అన్నారు. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ దివంగత నల్లమల చంద్రమౌళి అమెరికాలో అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, ఆయన స్నేహితుడు పోట్టుమత్తు రామానంథ్ సాగర్ కుమారుడు ఎన్నారై విజయానంద్ సాగర్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ ఏరియాస్పత్రి ఆవరణలో మంగళవారం పేదలకు సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ కరుణ్ కుమార్, వ్యాపారవేత్త నల్లమల సుబ్బారావు లు మాట్లాడుతూ హుజుర్ నగర్ లో పుట్టి, పెరిగి, చదువుకున్న నల్లమల చంద్రమౌళి అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీని స్థాపించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. ఎన్నారై చంద్రమౌళి అమెరికాలో ఎంతోమంది స్నేహితులకు తెలుగు ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు అందించాడని కొనియాడారు. సొంత ఊరిలో చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకి చేయూతను అందించాడని అన్నారు. చంద్రమౌళి పేరుమీద మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వ్యాపారవేత్త నల్లమల సుబ్బారావు మాట్లాడుతూ తన తమ్ముడు చంద్రమౌళి పేరు మీద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఓరుగంటి నాగేశ్వరరావు, వీర్లపాటి గాయత్రి భాస్కర్, అమరబోయిన గంగరాజు, పొట్టుముత్తు విశ్వకాంతు, ఇందిరాల రామకృష్ణ పాల్గొన్నారు.