పేదల కోసం కెసిఆర్‌ భారీ కానుక

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే

జనగామ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): పేదలకు నివాసం కోసం సిఎం కెసిఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిని గౌరవంగా చూసుకునే కార్యక్రమంలో భాగంగా ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలోని బాణాపురంలో 560 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 29.68 కోట్ల రూపాయల ఖర్చుతో పేదలకు ఈ గృహాలు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. అలాగే పేదలకు కంటివెలుగు కోసం పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నారని అన్నారు. ఆరోగ్య తెలంగాణెళి సీఎం కేసీఆర్‌ ధ్యేయమని అన్నారు.కంటి వెలుగు అద్భుత పథకమన్నారు. దృష్టి లోపాన్ని నివారించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పథకంలో భాగంగా ఉచిత కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ, ఆపరేషన్లు నిర్వహిస్తారన్నారు. కంటి వెలుగు పథకంలో అన్ని శాఖలఅధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు.