పోడుభూముల్లో మొక్కులు నాటే ప్రయత్నం

అడ్డుకున్న మహిళా రైతులు
ఖమ్మం,జూన్‌20(జ‌నంసాక్షి): ఖమ్మంలో మరోమారుపోడు భూములపై ఉద్రిక్తత ఏర్పడింది. పోడు భూముల్లో పొలం దున్నే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత 40 సంత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంతాన్ని వదిలి పొమ్మంటే ఎక్కడికి పోతమంటూ మహిళా రైతులుపోలీసులను ప్రశ్నించారు. చావనైనా చస్తాం కానీ ఇక్కడి నుంచి మాత్రం పోయేదిలేదన పోడు వ్యవసాయం చేసుకుంటున్న మహిళలు అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తాడేపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ అధికారులను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక మహిళలు అధికారుల విూదకు తిరగబడటంతో పాటు తోపులాటకు దిగడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన కారుల్లో మహిళలు ఎక్కువగా ఉండటంతో.. అధికారులు పెద్ద ఎత్తున మహిళ సిబ్బందిని పిలిపించి ఆందోళనకారులను శాంతింపచేయడానికి యత్నించారు.