పోరాడాలి రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదు

21కు చేరిన వైరస్ బాధితులు సంఖ్య వారు భాగస్వామ్యం

హైదరాబాద్,మార్చి 21(జనంసాక్షి): తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అ య్యింది. దుబాయి నుంచి వచ్చిన యువకుడి ద్వారా ఈ వ్యక్తికి కరోనా సోకింది. ఈ మేరకు రాష్ట్ర సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కు చేరింది. రాష్ట్రంలో  – 21కు చేరిన వైరస్ బాధితులు సంఖ్య రోగి నుంచి మరొకరికి సోకిన కరోనా మొదటి కేసు ఇదే కావడం గమనార్హం. దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి ఈ నెల 19న కరోనా పాజిటివ్ అని వైద్యులు గుర్తించారు. వాస్తవానికి అతడు ఈ నెల 14నే దుబాయి నుంచి భాగ్యనగరం చేరుకున్నాడు. 17 వరకు ఇంట్లోనే ఉన్నాడు. 17న కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయగా ఈ నెల 19న ఆ వ్యక్తికి కరోనా సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అతడితో సన్నిహితంగా మెలిగిన మరో 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి కాంటాక్ట్ కేసు కావడం గమనార్హం. 14న దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ వ్యక్తి 14 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలన్న సర్కారు సూచన పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.