పోలవరంపై విపక్షాల దుష్పచ్రారం: ఎంపి

ఏలూరు,జనవరి9(జ‌నంసాక్షి ):  పోలవరంపై దుష్పచ్రారం తప్ప దానిని సత్వరంగా పూర్తి చేయించుకుంటే ప్రజలకు మేలు కలుగుతుందన్న ఆలోచన విపక్షాల్లో కానరావడం లేదు. కేవలం రాజకీయం చేస్తూ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, దానిపై విమర్శలు చేయడం, నిధుల గోలుమాల్‌ జరిగిందని లేఖలు రాయడం వల్ల నష్టపోయేది ఎపి ప్రజలే అని గ్రహించాల్సి ఉంది. ప్రాజెక్ట్‌ నిర్మాణం మరింత ఆలస్యం కావడంతో పాటు కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగనుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. పదేళ్ల పాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా దీనిని పూర్తి చేసేందుకు చిత్తశుద్ది ప్రదర్శించలేదు. ఎన్‌ఇనకలకు మరో ఏడాది ఉండగా ఇప్పుడు మేల్కొన్న కాంగ్రెస్‌ నేతలు పాదయాత్రలతో ప్రాజెక్టుపై దుష్ట్రపచారం చేస్తున్నారని ఏలూరు ఎంపి మాగంటి బాబు మండిపడ్డారు.  దుష్పచ్రారం చేస్తూ గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని నాయకులు పాదయాత్ర పేరుతో మళ్లీ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోలవరానికి తామే జాతీయ ¬దా కల్పించామని చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విభజన చట్టంలో ముంపు మండలాలను ఎందుకు కలపలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్ల ముంపు మండలాలను రాష్ట్రంలో కలిపారని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేసుకున్నారని ఆరోపించారు. తెదేపాపై విమర్శలు చేస్తున్న నాయకులంతా సిగ్గుపడేలా 2019 నాటికి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా అనేక ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి. ఎగువ కాఫర్‌ డ్యాం పనులకు అనుమతి వచ్చింది. మిగతా పనులన్నింటిలో పురోగతి ఉంది. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళుతున్నా  అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరానికి నిధుల కొరత రాదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  ఈ ఏడాది కాఫర్‌ డ్యాం పనులను పూర్తి చేసి, గ్రావిటీ ద్వారా నీటిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తమ లక్ష్యం నెరవేరుతుందన్న ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. దీనిపై చిత్తశుద్దితో సిఎం పనిచేస్తుంటే కాంగ్రెస్‌, వైకాపాలు రాజకీయాలుచేస్తున్నాయని మండిపడ్డారు.