ప్రగతిభవన్‌లో అధికారులతో సిఎం కెసిఆర్‌ సమాలోచనలు జ‌నం సాక్షి

చెక్కుల పంపిణీ, అవతరణ వేడుకలపై సవిూక్ష
హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): వరుసగా రెండోరోజూ  ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, కలెక్టర్లతో బుధవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. మంగళవారం వరకు జరిగిన చెక్కుల పంపిణీని సవిూక్షించడంతోపాటు, జూన్‌ 2 నాటికి మొత్తం కార్యక్రమాన్ని ముగించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చర్చిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు ఎంతమంది రైతులకు పాస్‌పుస్తకాలు, చెక్కులు అందించారు? ఇంకా ఎన్ని మిగిలాయి? ఎందుకు మిగిలాయి? వారికి పాస్‌పుస్తకాలు, చెక్కులు ఎప్పుడిస్తారు? అసలు ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. జూన్‌ 2లోగా పంపిణీ కార్యక్రమం పూర్తి కావడానికి అవసరమైన వ్యూహం ఖరారుచేస్తారు. రైతులకు జీవిత బీమా పథకం, కంటి వెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయితీరాజ్‌ ఎన్నికల ఏర్పాట్లు అంశాలపై కూడా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషి, స్పీకర్‌ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహముద్‌ అలీ, మంత్రులు, అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.