ప్రచారంలో లేననడం అవాస్తవం

టిఆర్‌ఎస్‌పై దుష్పచ్రారంలో కాంగ్రెస్‌ ముందంజ

దానికి ప్రజలే బుద్ది చెబుతారన్న వేణుగోపాలచారి

పలు ప్రాంతాల్లో నేతల జోరు ప్రచారం

ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్‌ అని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. తాను ప్రచారంలో లేనని, రానని పలువురు పలురకాలుగా చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. టిఆర్‌ఎస్‌లో తమ అధినేత కెసిఆర్‌ టిక్కెట్లు ఇచ్చిన వారందరిని గెలిపించవాలసిన బాధ్యత తమపై ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో కూడా అన్ని సీట్లను గెలిపించి మరోమారు కెసిఆర్‌ను సిఎం చేయాలని కోరారు. ఆదిలాబాద్‌ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఆది,సోమవారాల్లో ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఢిల్లీలో ఉన్నదని, తెలుగుదేశం నాయకులు చంద్రబాబు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొన్నదని వ్యాఖ్యానించారు. ప్రజాకూటమిని ప్రజలు విశ్వసించబోరన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. సీఎం కేసీ=ఆర్‌ నేతృత్వంలోని సర్కార్‌ నాలుగున్నరేండ్లలో ఏమేమి అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేసిందో గడపగడపకూ వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌, టీడీపీలను దునుమాడుతూ.. అధికారం కోసం వారు చేస్తున్న కుట్రలను ఎండగడుతున్నారు. అధికారం కోసం పగటి కలలుకంటూ కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్‌, టీడీపీలకు ఓటేస్తే రాష్ట్రం నాశనమవుతుందని వేణుగోపాలాచారి అన్నారు.

ఆంధ్రాపార్టీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ నాయకులకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని సూచించారు.

తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌, టీడీపీలు ప్రజాకూటమితో వస్తున్నాయని, వాటికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ఆదరించాలని కోరారు. బాన్సువాడ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని ప్రజలను కోరారు. భారీ మెజార్టీతో తనను గెలిపిస్తే ఎల్లవేళలా అండగా ఉండి అభివృద్ధికి పాటుపడుతానని వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు టీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా ఉంటామని, కారుగుర్తుకే ఓటేస్తామని తెలిపారు.

నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి , సాగర్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు శాంతినగర్‌, ఎన్నెస్పీ కాలనీలో, మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నాంపల్లి, సంస్థాన్‌నారాయణపురం మండలా ల్లో, నకిరేకల్‌ అభ్యర్థి వేముల వీరేశం కట్టంగూర్‌ మండలం లో ప్రచారం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ విూడియాతో

మాట్లాడుతూ.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అవినీతి పరుడని, అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు కలిసికట్టుగా సైదిరెడ్డిని గెలిపించుకోవాలని సూచించారు.

/ుజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌, రూరల్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత పాలకుల హయాంలో బంజారాల అభివృద్ధి శూన్యమని, కేసులు పెట్టించి గిరిజనులను వేధించిన ఘనత కాంగ్రెస్‌, టీడీపీలకే దక్కుతుందన్నారు. గిరిజనుల అభివృద్ధికి కృషిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు అండ గా నిలబడాలని అభ్యర్థించారు. వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలంలో ప్రచారం చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థి తాటికొండ రాజయ్య రఘునాథపల్లి మండలంలో, వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్‌ గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 55వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.రీంనగర్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ నగరంలో, రూరల్‌ మండలం ఆరెపల్లిలో ప్రచారం చేశారు. హుజూరాబాద్‌, జమ్మికుంటలో మంత్రి ఈటలకు మద్దతుగా, మానకొండూర్‌ మండలం తిమ్మాపూర్‌, గన్నేరువరం గ్రామాల్లో రసమయికి మద్దతుగా శ్రేణులు ప్రచారం చేశాయి. ఖమ్మం జిల్లా పాలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తిరుమలాయపాలెం మండలం కొత్తకొత్తూరు, తిర్లాపురం తండా, అజయ్‌తండా, భైరవు నిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.