ప్రజలు చూస్తూ ఊరుకోరు

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మేలు: డిసిసి
మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): జూపల్లి కృష్ణారావు రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్‌ పార్టే కారణమని, ఈ విషయాన్ని ఆయన మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ మండిపడ్డారు. ఆయన మంత్రిగా ఉండి కొల్లాపూర్‌కు పరిశ్రమలు తేలేదని, స్వార్థ ప్రయోజనాల కోసం కేఎల్‌ఐ ప్రాజెక్టు పనులు ఆలస్యంగా పూర్తయ్యేందుకు కారణమయ్యారన్నారు. విూరు ఇష్టం వచ్చినట్టల్లా దోచుకుతింటుంటే.. చూస్తూ కూర్చోవడానికి ప్రజలేం అమాయకులు కాదని మండిపడ్డారు. కేఎల్‌ఐ ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ హయాంలో ప్రారంభించారని, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేశారన్నారు. అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను పూర్తిచేసి ప్రాజెక్టు మొత్తం టీఆర్‌ఎస్సే పూర్తిచేసిందనే రీతిలో ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కొల్లాపూర్‌ అభివృద్ధి కోసం సోమశిల బ్రిడ్జిని నిర్మిస్తామని, కొల్లాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తామని, జీఓ 98 అమలు చేసి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని, అటవీ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇస్తామని హావిూ ఇచ్చారు. కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా రుణం తీర్చుకుందాం అన్నారు. పాలమూరు జిల్లాలోని అన్ని స్థానాలతోపాటు, కొల్లాపూర్‌లో కూడా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. కొల్లాపూర్‌లో సంబరాల నిర్వహణకు జూపల్లి కృష్ణారావు కోట్లు ఖర్చు చేశారని, దీని పై ఎన్నికల కమిషన్‌ విచారణ చేపట్టాలన్నారు. పాలమూరు జిల్లాను అధికార పార్టీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్‌ఎ/-లాన్‌ కింద వి విధ పథకాలు అమ లు చేస్తామన్నారు. ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీళ్లిచ్చిన తర్వాతనే ఓట్లడుగుతానని కేసీఆర్‌ ప్రకటించారు. మరి ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఓట్లెలా అడుగుతారని కొత్వాల్‌  ప్రశ్నించారు. కొల్లాపూర్‌ ప్రజలను ప్రతిసారి మోసం చేసి గెలుస్తున్న జూపల్లిని ఈసారి ఓడించాలని  కోరారు.